విశాఖ జిల్లాలో వైఎస్ఆర్ సీపీ రహదారుల దిగ్బంధం

6 Nov, 2013 10:01 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రహదారుల దిగ్బంధం కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో నగరంలోని ఎన్ఏడీ కొత్త రోడ్డు జంక్షన్లో పసుపులేటి ఉషాకిరణ్, పక్కి దివాకర్ ఆధ్వర్యంలో బుధవారం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దాంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

 

అలాగే  పెందుర్తి జంక్షన్లో ఆ పార్టీ కన్వీనర్ గండి బాబ్జి నేతృత్వంలో రోడ్ల దిగ్బంధించారు. దాంతో బైపాస్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. గాజువాక జంక్షన్లో ఆ పార్టీ నేత నాగిరెడ్డి ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధించారు. అలాగే విశాఖపట్నం నగర కన్వీనర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో హనుమంతవాక, మద్దెలపాలెం, ఇసుక తోట పరిసరాల్లో జాతీయ రహదారిపై వైఎస్ఆర్ సీపీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి.

 

కాగా విశాఖ జిల్లాలోని అరకులో మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు ఆధ్వర్యంలో అంతరాష్ట్ర ఒరిస్సా రహదారిపై ధర్నా నిర్వహించారు. అలాగే భీమిలి నియోజకవర్గ పరిధిలోని కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో జాతీయరహదారిని దిగ్బంధించారు.

మరిన్ని వార్తలు