రైతు సమస్యలపై వాయిదా తీర్మానం

16 May, 2017 09:15 IST|Sakshi

అమరావతి: రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, అలాగే రూ.5వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం వాయిదా తీర్మానం ఇచ్చింది. కాగా  వస్తు సేవల పన్ను

(జీఎస్టీ) బిల్లు ఆమోదం కోసం రాష్ట్ర శాసనసభతో పాటు శాసనమండలి ఇవాళ ప్రత్యేకంగా సమావేశం అవుతున్నాయి. ఉదయం 9.45 గంటలకు అసెంబ్లీ, ఉదయం 10.15 గంటలకు మండలి సమావేశాలు ఆరంభం కానున్నాయి.

అంతకు ముందు శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి వైఎస్‌ఆర్‌ సీపీ నుంచి ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్‌ రెడ్డి హాజరయ్యారు. సమావేశాలను నాలుగు రోజులు జరపాలని వైఎస్‌ఆర్‌ సీపీ డిమాండ్‌ చేయగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం జీఎస్టీ బిల్లును మాత్రమే ఆమోదించి  ఒక్కరోజులోనే అసెంబ్లీ, మండలి సమావేశాలను ముగించాలని నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై వైఎస్‌ఆర్‌ సీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది.

కాగా ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌ సీపీ రైతు సమస్యలు, పంటలకు గిట్టుబాటు ధరలపై కూడా చర్చించడానికి పట్టుబట్టనుంది. ప్రధానంగా మిర్చి రైతుల కష్టాలను ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ సభలో ప్రస్తావించనున్నారు.

మరిన్ని వార్తలు