టీడీపీకి ఓటడిగే హక్కు లేదు

26 Mar, 2019 11:55 IST|Sakshi
పెళ్లకూరులో ప్రచారం చేస్తున్న సంజీవయ్య, సత్యనారాయణరెడ్డి 

వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య   

సాక్షి, పెళ్లకూరు: అవినీతి, అక్రమాలకు పాల్పడిన టీడీపీ నాయకులకు ఓటడిగే హక్కు లేదని సూళ్లూరుపేట ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య అన్నారు. సోమవారం మండలంలోని పుల్లూరు, ముమ్మారెడ్డిగుంట, చింతపూడి, యాలకారికండ్రిగ, ముప్పాళ్లవారికండ్రిగ తదితర గ్రామాల్లో ఎంపీపీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2015లో వచ్చిన వరదలకు ఈ ప్రాంతంలో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పిన చంద్రబాబు ఒక్క పైసా కూడా అన్నదాతలకు ఇవ్వలేదన్నారు.

నీరు – చెట్టు కింద మంజూరైన పనులను, రైతు రథాలపై అందించిన ట్రాక్టర్లను పర్సంటేజీలు తీసుకుని అప్పగించిన నాయకుడికి ఓట్లు వేయడం ఎంతవరకు న్యాయమో టీడీపీ శ్రేణులే ఆలోచించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు చిందేపల్లి మధుసూదన్‌రెడ్డి, డాక్టర్‌ పాలూరు మహేంద్రరెడ్డి, పార్టీ మండల కన్వీనర్‌ మారాబత్తిన సుధాకర్‌ నాయకులు చైతన్యకృష్ణారెడ్డి, లక్ష్మీనారాయణ, సుబ్బారెడ్డి, శంకరయ్య, బాలాజీ, శేఖర్‌రెడ్డి, గోపాల్, రాజారెడ్డి, బాబు, మురళి, కేశవ్‌రెడ్డి, చంద్రయ్య, రఘురామయ్య తదితరులు పాల్గొన్నారు.


చమరగీతం పాడాలి 
నాయుడుపేటటౌన్‌: టీడీపీ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య పిలుపునిచ్చారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు ఓట్టురు కిషోర్‌యాదవ్, మల్లెలా మనోహర్‌రెడ్డిల సారథ్యంలో మండల పరిధిలోని కలిపేడు గ్రామానికి చెందిన 50 కుటుంబాల పెద్దలు సంజీవయ్య సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యేతోపాటు ఆ పార్టీ మండల కన్వీనర్‌ తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, జిల్లా కార్యదర్శి పాదర్తి హరినాథ్‌రెడ్డి, బీసీ నాయకులు గంధవళ్లి సిద్ధయ్య, భరత్‌ తదితర నాయకులు పార్టీ కండువాలను కప్పి ఘనంగా స్వాగతించారు.  

మరిన్ని వార్తలు