రాజధానిలో అసైన్డ్‌ భూముల పరిరక్షణ కమిటీ

15 Nov, 2018 12:29 IST|Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజధాని లంక, అసైన్డ్‌ భూముల పరిరక్షణ కమిటీ పర్యటించింది. ఈ పర్యటనలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, నేతలు కిలారి రోశయ్య, నందిగామ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసైన్డ్‌ భూములున్న రైతుల సమస్యలను కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. లంక, అసైన్డ్‌ భూముల ప్యాకేజీ విషయంలో తీవ్రమైన అన్యాయం జరుగుతుందంటూ కమిటీ సభ్యుల ముందు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కూలీలకు ప్రభుత్వం ఇచ్చే రూ.2500 కూడా సరిగా ఇవ్వడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు దేశం ప్రభుత్వం అన్ని విధాలుగా అన్యాయం చేస్తోందని రైతులు, రైతు కూలీలు కమిటీ ఎదుట మొరపెట్టుకున్నారు.

మరిన్ని వార్తలు