పాదయాత్రకు సంఘీభావంగా.. ర్యాలీలు

24 Sep, 2018 12:31 IST|Sakshi

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నేడు మూడువేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు సంఘీభావం తెలిపారు. పలు చోట్లు కేకులు కట్‌ చేయగా, మరికొన్ని ప్రాంతాల్లో వైఎస్‌ విగ్రహనికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

తూర్పు గోదావరి : వైఎస్‌ జగన్‌ మూడువేల కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు తునిలో కేక్‌ కట్‌చేశారు. అనంతరం కూడలిలో ఉన్న వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి సంఘీభావం తెలిపారు.

పశ్చిమ గోదావరి : పాదయాత్ర మూడువేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్‌ తానేటి వనిత ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కొవ్వూరు నుంచి పంగిడి వరకు  ర్యాలీ చేపట్టి పాదయాత్రను సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

నెల్లూరు : వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాద్రయాత్రకు సంఘీభావంగా జిల్లాలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్న కమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొని సంఘీభావం తెలిపారు. పార్టీ శ్రేణులు మూడువేల కొబ్బరి కాయలు కొట్టి ఆయన పాదయాత్ర విజయంతంగా కావాలిన ఆకాంక్షించారు. కార్యక్రమంలో ​మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి పాల్గొని.. పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తోందని అన్నారు.

విజయవాడ : పాదయాత్ర మూడువేల కిలోమీటర్లు చేరిన సందర్భంగా విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు సంఘీభావం తెలిపారు. పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త మల్లాది విష్ణు కేక్‌ కట్‌చేసి సంఘీభావం వ్యక్తం చేశారు.

ప్రకాశం : పాదయాత్రకు సంఘీభావంగా కందుకూరు నియోజకవర్గంలోని 3,4 వార్డులో పార్టీనేత మానుగుంట మహింధర్‌ రెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి నవరత్నాలు గురించి ప్రజలకు అవగహన కల్పించారు.

వైఎస్‌ఆర్‌ : పాదయాత్రకు సంఘీభావంగా మాజీ ఎంపీ అవినాష్‌ రెడ్డి, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి  పాదయాత్రలో పాల్గొన్నారు. పైడిపాలెం జలాశయం వద్ద వైఎస్సార్‌ విగ్రహానికి కృష్ణా జలాలతో అభిషేకం చేశారు.

కర్నూలు : పాదయాత్రకు సంఘీభావంగా ఎమ్మిగనూరులో జగన్‌ రావాలి.. జగన్‌ కావాలి కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఇంటింటికి వెళ్లి నవరత్నాలు గురించి ప్రజలకు తెలిపారు. పార్టీ నేత కాటసాని రామిరెడ్డి నేతృత్వంలో మండల కమిటి సమావేశం ఏర్పాటు చేశారు.

>
మరిన్ని వార్తలు