విద్యుత్ ఛార్జీల పెంపుపై చర్చకు పట్టు

24 Mar, 2015 09:11 IST|Sakshi

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్ఆర్ సీపీ  వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. అయితే దీన్ని  స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు.  వైఎస్ఆర్ సీపీ సభ్యులు మాత్రం చర్చకు అనుమతించాలని పట్టుబట్టారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు.  
దీంతో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని స్పీకర్ తెలిపారు. దీనిపై మంత్రి యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకుని విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని, సభను సజావుగా నడిచేందుకు సహకరించాలని అన్నారు. మరోవైపు విపక్ష సభ్యుల నిరసనల మధ్యే ప్రశ్నోత్తరాలు మొదలయ్యాయి.

 

>
మరిన్ని వార్తలు