ఫ్యాక్షన్‌ను రూపుమాపుతాం 

4 Apr, 2019 09:53 IST|Sakshi
మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్, చిత్రంలో ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

సాక్షి, ఆత్మకూరు: పదేళ్ల పరిటాల కుటుంబ నియంత పాలనతో రాప్తాడు నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారు. దాడులు, గొడవలు సృష్టించే వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారు. వైఎస్సార్‌సీపీకి ఒక్క అవకాశమిస్తే నియోజకవర్గంలో ఫ్యాక్షనిజాన్ని రూపుమాపి అభివృద్ధికి బాట వేస్తాం’ అని వైఎస్సార్‌సీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్, రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరు మండలం వేపచెర్ల, వేపచెర్ల ఎగువ తండా, దిగువ తండా గ్రామాల్లో బుధవారం వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గోరంట్ల మాధవ్, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ   వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హంద్రీ – నీవా పిల్లకాలువల ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరందిస్తామని హామీ ఇచ్చారు. పరిటాల పాలనలో రాప్తాడు నియోజకవర్గం ఎటుంటి అభివృద్ధికీ నోచుకోలేదని, ప్రజలు పనులు లేక వలసలు వెళ్లారని గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి గ్రామాల్లో ఫ్యాక్షనిజం లేకుండా చే స్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు 2.50 ఎకరాల చొప్పున భూ పంపిణీ చేసి ఉచిత బోర్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో 8 చిన్న రిజర్వాయర్లను ఏర్పాటు చేసి పిల్ల కాలువ ద్వారా సాగునీరు అందేలా చూస్తామని తెలియచేశారు. పీఏబీఆర్‌ కాలువ ద్వారా ప్రతి ఇంటికీ తాగు నీటిని అందజేస్తామన్నారు. రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలంటే ఒక్క జగన్‌తోనే సాధ్యమన్నారు. నవరత్నాల కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుతుందన్నారు. 


బీసీల ద్రోహి చంద్రబాబు 
బీసీల ద్రోహి చంద్రబాబునాయుడు అని వైఎస్సార్‌సీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌ విమర్శించారు. బీసీల అభ్యున్నతికి జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. బీసీ డిక్లరేషన్‌తో బీసీలందరికీ న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాప్తాడు నియోజకవర్గం సాగునీటితో సçస్యశ్యామలం కావాలన్నా ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు