ప్రజల డబ్బుతో దీక్షలా?: వైవీ

9 Feb, 2019 02:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రత్యేక హోదాకోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చందాలు వేసుకుని పోరాటాలు చేస్తే సీఎం చంద్రబాబు  ప్రజల డబ్బుతో దొంగ దీక్షలు చేస్తున్నారని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శిం చారు.ధర్మపోరాట దీక్ష పేరిట ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరిని మభ్యపెట్టేందుకు ఈ ధర్మపోరాటమన్నారు. ఈ నెల 11న ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష పేరిట జిల్లాలనుంచి టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులు, ఉద్యోగులను ఢిల్లీకి తరలిస్తుండడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వ ఖర్చుతో రెండు రైళ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారన్నారు. మొత్తంగా ఢిల్లీ దీక్ష కోసం రూ.10 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 

హోదా అవసరం లేదని  నువ్వే అన్నావుగా...  
ప్రత్యేక హోదా అవసరం లేదని ప్యాకేజీనే కావాలంటూ చంద్రబాబు గతంలో అన్నారని, ప్యాకేజీ నిధులకు కేంద్రం అంగీకరించిందని వెంకయ్యనాయుడుతోపాటు ఇతర కేంద్ర మంత్రులను సన్మానించారని వైవీ గుర్తు చేశారు. హోదా సంజీవని కాదని, ప్యాకేజీతోనే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకోవాలన్నారు.  

మరిన్ని వార్తలు