‘రైతన్నకు అండగా వైఎస్సార్ సీపీ’

3 Jun, 2014 03:33 IST|Sakshi
‘రైతన్నకు అండగా వైఎస్సార్ సీపీ’

 వేంపల్లె, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ సారథ్యంలో రైతు శ్రేయస్సే ధ్యేయంగా నిరంతరం పోరాటం చేస్తుంటామని పులివెందుల వైఎ స్సార్ సీపీ ఇన్‌ఛార్జి వైఎస్ భాస్కర్‌రెడ్డి  అన్నారు. సోమవారం ఆయన వేంపల్లెలో గాలివాన బీభత్సం తో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అంతకుముందు ఆయన ఉద్యానవన శాఖ ఏడీ మధుసూదన్‌రెడ్డితో చర్చించారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  2010-14వరకు ప్రకృతి వైపరీత్యాలవల్ల జిల్లాలో దెబ్బతిన్న పంటలకు రూ.538కోట్లు మంజూరైందనిన్నారు. వైఎస్సార్ సీపీ తరపున అప్పటి ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, ప్రస్తుత పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిలతోపాటు తా ను అధికారులతో పంట నష్టం పరిహారంపై సుదీ ర్ఘంగా చర్చించామన్నారు. పలుమార్లు జిల్లా కలెక్టర్‌ను కలిసి రైతుల ఇబ్బందులను తెలియజేసి పరి హారం ఇప్పించాలని కోరామన్నారు.వైఎస్సార్ సీపీ కృషి ఫలితంగానే గతంలో నష్టపోయిన పంటలకు పరిహారం మంజూరైందన్నారు. దీంతోపాటు ప్రస్తు తం దెబ్బతిన్న పంటల నివేదికలను తయారుచేసి త్వరగా పరిహారం వచ్చేలా చూడాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, ఎంపీపీ అభ్యర్థి రవికుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు షబ్బీర్‌వల్లి తదితరులు పాల్గొన్నారు.
 
 రైతు ఖాతాల్లోకి పరిహారం

 వేంపల్లె: ఈ నెల 6వ తేదీ తర్వాత పంట నష్టపరి హారం ఆయా రైతుల ఖాతాల్లో జమ అవుతుం దని ఉద్యానవన శాఖ ఏడీ మధుసూదన్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన గాలివాన బీభత్సం వల్ల దెబ్బతిన్న పంటలను చింతలమడుగుపల్లె, నేలవరం తాండలో పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 2010 నుంచి 2014 వరకు దెబ్బతిన్న ఉద్యావన  పంటలకు రూ.538కోట్లు మంజూరైనట్లు తెలి పారు. అరటికి హెక్టార్‌కు రూ.24వేలు, బొప్పాయికి హెక్టార్‌కు రూ.10వేలు, మామిడికి హెక్టార్‌కు రూ.15వేలు, దోసకు హెక్టార్‌కు రూ.6వేలు మంజూరైనట్లు తెలిపారు. ఇందులో అరటి పంట ఎక్కువగా దెబ్బతిందన్నారు.  ప్రస్తుతం గాలివాన బీభత్సంవల్ల జిల్లాలో 500 హెక్టార్లల్లో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయన్నారు.

>
మరిన్ని వార్తలు