టీడీపీ కోటలో వైఎస్సార్‌ సీపీ పాగా

24 May, 2019 15:11 IST|Sakshi

సాక్షి, పెదకూరపాడు: తెలుగు దేశం పార్టీ కంచుకోట అయిన పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ తొలిసారి జెండా ఎగురువేసింది. తెలుగుదేశం పార్టీ పట్టున్న గ్రామాల్లో సైతం వైఎస్సార్‌ సీపీ జెండా రెపరెపలాడింది. తొలి రౌండ్‌ నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు సమీప టీడీపీ అభ్యర్థి కొమ్మాలపాటి శ్రీధర్‌పై ఆధిక్యతను సాధించారు. మొత్తం 19 రౌండ్లు జరిగిన కౌంటింగ్‌లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు 14,104 ఓట్లు ఆధిక్యతతో గెలుపొందారు. టీడీపీ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. జనసేన పార్టీ మూడో స్థానంలో నిలిచింది. 
 

రౌండ్‌ రౌండ్‌కు పెరిగిన మోజార్టీ 
పెదకూరపాడు నియోజకవర్గంలో మొత్తం 2,22,675 ఓట్లు ఉండగా, వాటిలో 1,96,466 ఓట్లు పోలైయ్యాయి. అందులో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థికి 99,577 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి కొమ్మాలపాటి శ్రీధర్‌కు 85,473 ఓట్లు వచ్చాయి. జనసేన పార్టీ అభ్యర్థి పుట్టి లక్ష్మీసాంమ్రాజ్యంకు 7,156 ఓట్లు వచ్చాయి. మొత్తం 265 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా కౌంటింగ్‌కు మొత్తం 19 రౌండ్లు నిర్వహించారు. 
 

పోస్టల్‌లోనే భారీ మెజార్టీ 
పెదకూరపాడు అసెంబ్లీ సెగ్మెంట్‌లో పోస్టల్‌లోనై వెఎస్సార్‌ సీపీ విజయబావుట ఎగురవేసింది. మొత్తం 1239 ఓట్లుకు గాను వైఎస్సార్‌సీపీ 706    టీడీపీకి 352, జనసేనకు 42 ఓట్లు వచ్చాయి. ఉద్యోగులు కూడ వైఎస్సార్‌సీïల వైపు మొగ్గు చూపారు.
 

తొలిసారి పోటీ.. తొలిసారి ఎమ్మేల్యే నంబూరు..
ప్రత్యేక్ష ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మేల్యేఅ భ్యర్థిగా పోటీ చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు ఎమ్మేల్యేగా గెలుపొందారు. తొలిసారి పోటీలో నిలిచి విజేతగా నిలిచారు. 

మరిన్ని వార్తలు