రాజకీయాల్లో అరుదైన నేత వైఎస్‌ జగన్‌

10 Apr, 2019 11:47 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ హిందూపురం పార్లమెంటు అభ్యర్థి గోరంట్ల మాధవ్‌

సాక్షి, అనంతపురం:‘వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయాల్లో అత్యంత అరుదైన వ్యక్తి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింమైనార్టీల పట్ల చిత్తశుద్ధి ఉన్న నేత అని వైఎస్సార్‌సీపీ హిందూపురం పార్లమెంటు అభ్యర్థి గోరంట్ల మాధవ్‌ పేర్కొన్నారు. జగనన్నలో ఓ అంబేడ్కర్, జ్యోతిరావ్‌పూలే, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి తదితర మహానుభావుల్లో ఉండే వ్యక్తిత్వాన్ని చూశానన్నారు. ఆయన చేసే ప్రజాసేవను స్ఫూర్తిగా తీసుకొని వైఎస్సార్‌సీపీని రాజకీయ వేదికగా ఎంచుకున్నానన్నారు. తనకు ఎంపీగా అవకాశమిస్తే పార్లమెంట్‌లో అట్టడుగు వర్గాల సమస్యలపై గళం విప్పుతానని అంటున్న గోరంట్ల మాధవ్‌ .. ‘సాక్షి’తో మరిన్ని విశేషాలు పం చుకున్నాడు.


ఆయన మాటాల్లోనే...
తాను చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చా.. చిన్నప్పటి నుంచి అనేక కష్టాలు పడుతూ పెరిగా.. ఆ కసితోనే చదివి ఎస్‌ఐ ఉద్యోగం సాధించా.. ఎస్‌ఐ, సీఐగా పనిచేసినంత కాలం బాధితుల పక్షాన నిలిచానని ఆయన తెలిపారు. డిపార్ట్‌మెంట్‌లో చేసిన సేవే ఇప్పుడు జిల్లాలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా బడుగు, బలహీన, అట్టడుగు వర్గాలు అక్కున చేర్చుకుంటున్నారు.


మరింత సేవ చేయాలనే...
ఉద్యోగిగా ప్రజాసేవ చేసేందుకు పరిధి చాలా తక్కువ ఉంటుంది. అదే రాజకీయంలోకొస్తే సేవలు విస్త్రతం చేయొచ్చు. ఎంపీగా అవకాశం ఇస్తే బడుగు, బలహీన వర్గాల ఆలోచన విధానాన్ని రేపు పార్లమెంటులో ఆవిష్కరిస్తా. ఈ అవకాశం పోలీసుశాఖలో ఉంటే వస్తుందా?. యావత్తు దేశంలోని బీసీ, ఎస్సీ,ఎస్టీల ప్రతినిధిగా మాట్లాడొచ్చు. అందుకోసమే పోలీసు నుంచి రాజకీయాల్లోకొచ్చా. పూర్తిగా ప్రజల్లో మమేకమై ఉంటా. వందశాతం బాధితుల పక్షాన నిలబడే వ్యక్తిని. పక్కా నిజాయతీగా నిలిచే తత్వం. ఎన్నికలల్లో ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా బరిలో నిలబడ్డా. కష్టంగాని, నష్టంగాని నమ్మిన వ్యక్తికి అండగా నిలిచే వ్యక్తిని. ఎప్పుడూ ప్రజల్లో ఉండే వ్యక్తిని. 


బలహీన వర్గాల పట్ల  చిత్తశుద్ధి ఉన్న నాయకుడు 
నామినేటెట్‌ పోస్టులు, పనుల్లో బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించేలా చట్టబద్ధత చేస్తామని జగనన్న చెప్పడం చూస్తే దేశంలోనే బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో ఆ విధంగా ఆలోచించలేదు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలో ఎంతో గొప్ప వ్యక్తిత్వముంది. జిల్లాలో జగన్‌మోహన్‌రెడ్డి సైని కుడిగా పని చేస్తానని చేరినరోజే చెప్పా. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదరించి అక్కున చేర్చుకుని పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించారు. అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తనలాంటి వారికి ఎం పీగా పోటీ చేసే అవకాశం కల్పించడం నిజంగా అదృçష్టమే. జిల్లాలో బీసీలంతా జగన్‌కు రుణపడి ఉంటాం. రెండు సీట్లు గెలిచి అధినేతకు కానుకగా ఇస్తాం. 

మరిన్ని వార్తలు