డీజీపీ ఆర్పీ ఠాకూర్‌పై ఆర్కే ఫిర్యాదు

14 Mar, 2019 16:59 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఎన్నికలు పూర్తయ్యే వరకు డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను పదవి నుంచి తప్పించాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేదికి విఙ్ఞప్తి చేశారు. ఠాకూర్‌ అ‍ప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయనపై ఫిర్యాదు చేశారు. అనంతరం రామకృష్ణా రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... ‘ ఠాకూర్‌ డీజీపీగా ఉంటే ప్రజలు ఓటు హక్కును సజావుగా వినియోగించుకోలేరు. ఆయనపై నేను వేసిన పిల్‌ పెండింగ్‌లో ఉండగానే సీఎం.. ఠాకూర్‌ను డీజీపీగా నియమించారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై దాడి సమయంలోనూ సానుభూతి కోసం దాడి చేయించుకున్నారంటూ డీజీపీ చెప్పారు. ఈ విషయాన్ని కూడా ఈసీ ఫిర్యాదులో పేర్కొన్నా’ అని వ్యాఖ్యానించారు.

ఏపీ డీజీపీ పార్కు ఆక్రమణ నిజమే! 

జీహెచ్‌ఎంసీ పార్కు స్థలాన్ని డీజీపీ ఠాకూర్‌ ఆక్రమించుకుని ఇల్లు నిర్మించి... అఖిల భారత సర్వీస్‌ అధికారుల రూల్స్‌ను అతిక్రమించారని రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. కాగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 72 ప్రశాసన్‌నగర్‌లో డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ (ప్లాట్‌ నం.149) జీహెచ్‌ఎంసీ పార్కును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ సర్కిల్‌–18 టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు