జత కట్టినప్పుడు గుర్తుకు రాలేదా బాబూ!

7 Oct, 2018 07:45 IST|Sakshi

వైఎస్సార్‌ సీపీ నేత జక్కంపూడి విజయలక్ష్మి

మధురపూడి (రాజానగరం): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌లతో ముఖ్యమంత్రి చంద్రబాబు జతకట్టినప్పుడు గుర్తుకురాలేదా, ఇప్పుడు విమర్శిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి దుయ్యబట్టారు. కోరుకొండ మండలంలో శనివారం సుడిగాలి పర్యటన చేవారు. బుచ్చెంపేటలో జక్కంపూడి గణేశ్‌ నిర్వహిస్తున్న పాదయాత్ర వద్దకు చేరుకుని, యాత్రలో పాల్గొన్న యువతను అభినందించారు. ఈ సందర్భంగా జక్కంపూడి విలేకర్లతో మాట్లాడుతూ అమరావతి రాజధాని శంకుస్థాపనకు గంగానది నీరు. 

మట్టి తీసుకొచ్చినప్పుడు పొగిడిన చంద్రబాబు, ఇప్పుడు విమర్శించడం ఎంత వరకూ సబబన్నారు. అప్పుడెందుకు చెలిమికట్టారు, ఇప్పుడెందుకు విమర్శిస్తున్నారని ఆమె ప్రశ్నించారు.  ప్రత్యేక హోదా విషయంలో బాబు పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. యువనేస్తం పథకాన్ని కన్నీటితుడుపుగా నిర్వహించారన్నారు. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జనం మద్దతు ఉందని, పొత్తుల కోసం ఆరాటపడే నాయకుడు కాదని జక్కంపూడి అన్నారు. అలాగే జక్కంపూడి కుటుంబం ప్రజల సంక్షేమానికి అలుపెరగకుండా పొరాటం చేస్తుందన్నారు. అనంతరం గాదరాడలో ఇటీవల మృతి చెందిన పార్టీ నాయకుడు కుటుంబాన్ని పరామర్శించి, సానుభూతిని వ్యక్తం చేశారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా