‘బాబు జీవితమే అక్రమం’

21 Sep, 2017 04:12 IST|Sakshi
‘బాబు జీవితమే అక్రమం’

విజయవాడ: నది పక్కన అక్రమ నివాసంలో నివసిస్తున్న సీఎం చంద్రబాబు నదుల పరిరక్షణ గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ అన్నారు. ఆయన మీడియా మాట్లాడుతూ.. సేవ్‌ రివర్స్‌ పేరుతో బాబు అన్ని రివర్స్‌ పనులే చేస్తున్నారని ఆయన  ఎద్దేవా చేశారు.  చంద్రబాబు నిజ జీవితమే అక్రమమని ధ్వజమెత్తారు.

టీడీపీలో చేరి మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని ఆయన అన్నారు. ప్రాజెక్టుల్లోనూ సీఎం అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కేవలం కమిషన్ల కోసమే  ట్రాన్స్‌ట్రాయ్‌ని పక్కన పెట్టారని జోగి రమేష్‌ ఆరోపించారు. అమరావతి నిర్మాణానికి సినిమా దర్శకుల సహకారం కావాలా అని సీఎంను ఆయన ప్రశ్నించారు. నిర్మాణంపై ఇంజనీర్స్‌కు ఎక్కువగా అవగాహన ఉంటుందని, దర్శకులకు డిజైన్లు ఎలా తెలుస్తాయన్నారు.