వైఎస్సార్‌ జనతా క్యాంటీన్ ప్రారంభం

15 Dec, 2017 09:20 IST|Sakshi
వైఎస్సార్‌ జనతా క్యాంటిన్‌ ప్రారంభానికి పూజలు చేస్తున్న హిందూపురం సమన్వయకర్త నవీన్‌నిశ్చల్‌

అతి తక్కువ ధరకే టిఫెన్, భోజనం

హిందూపురం అర్బన్‌: మధ్యతరగతి, పేదల ప్రజలతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు చేయూతనందించాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరిట జనతా క్యాంటీన్ ను ప్రారంభించినట్లు హిందూపురం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌ నిశ్చల్‌ తెలిపారు. గురువారం స్థానిక చిన్న మార్కెట్, ప్రభుత్వాస్పత్రి వద్ద క్యాంటీన్ కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి రోజూ జీవనోపాధికోసం పట్టణానికి వస్తున్న పేదలు రోజంతా కష్టపడి సంపాదించుకున్న డబ్బు టిఫెన్, భోజనాలకే ఖర్చు పెట్టాల్సి వస్తోందని తెలిపారు. దీంతో అతి తక్కువ ధర రూ. 9కే కడుపు నిండా ఆహారం అందివ్వగలిగితే నాలుగు డబ్బులు ఇంటికి తీసుకెళ్లేందుకు అవకాశముంటుందని అన్నారు. క్యాంటీన‍్ల నిర్వహణకు డాక్టర్‌ సాయిప్రసాద్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆర్థిక సాయం అందిస్తోందన్నారు.

త్వరలో వీటిని హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు మండల కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, జిల్లా మైనార్టీ గౌరవధ్యక్షులు ఫజులూ రహమన్, కౌన్సిల్‌ ప్లోర్‌ లీడర్‌ శివ, ఏ బీ బ్లాక్‌ కన్వీనర్లు ఇర్షాద్, మల్లికార్జున, మండల కన్వీనర్లు నక్కలపల్లి శ్రీరాంరెడ్డి,  నారాయణస్వామి, మహిళ కన్వీనర్‌ నాగమణి, షామింతాజ్, కౌన్సిలర్లు నాగభూషణరెడ్డి, రజనీ, బీసీ, ఎస్సీసెల్‌ నాయకులు రాము, శ్రీన, జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యులు నారాయణస్వామి, కొల్లకుంట శివశంకర్‌రెడ్డి, నరసింహరెడ్డి, బాలాజీ, మైనార్టీ నాయకులు సమద్, ఇమ్రాన్, మన్సూర్, ముస్తక్, చాంద్‌బాషా, రియాజ్, రంగారెడ్డి, సురేంద్రరెడ్డి పాల్గొన్నారు.

నాయకులకు ఈ ఆలోచన రాలేదు
వందల వేల కోట్లు సంపాదించిన నాయకులకు పేదలకు సేవ చేయాలని తపన లేకుండా పోయిది. పేదలకు నామమాత్రపు ధరతో కడుపునిండా టిఫెన్, భోజనం అందించే చర్యలను వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చేపట్టడం అభినందనీయం.    – శివ, కౌన్సిల్‌ ప్లోర్‌ లీడర్‌

రూ.9కే నాలుగు ఇడ్లీలు
జనతా క్యాంటీన్ లో తొమ్మిది రూపాయలకు నాలుగు ఇడ్లీలు, సాంబర్, చెట్నీ ఇస్తున్నారు. పొంగల్, ఇతర టిఫెన్‌ కూడా అందుబాటులో ఉంచారు. మధ్యాహ్నం  అన్నం, సాంబర్, పెరుగన్నం ఇస్తున్నారు. మాములుగా అయితే రూ.60 పెడితే టిఫెన్, రూ.100పెడితే గానీ భోజనం రాదు.         – గంగాధర్, బేల్దార్, లేపాక్షి

మరిన్ని వార్తలు