అందుకే పెట్టుబడుదారులు పారిపోయారు..

8 Sep, 2019 13:31 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర్ర ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏడుపు గొట్టు రాజకీయాలు మానుకోవాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర్ర ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య హితవు పలికారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..ప్రజలు తిరస్కరించినా బాబులో మార్పు రాలేదని.. కుట్రలు,కుతంత్రాలతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర్రంలో అస్థిరతను నెలకొల్పేలా ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రామీణ ప్రాంతాల్లో సామరస్య వాతావరణాన్ని తేలేని వ్యక్తి.. రాజకీయవేత్తే కాదన్నారు. బాబు సిద్ధాంతాలను వైసీపీ ప్రభుత్వం కొనసాగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు అన్ని వ్యవస్థలను నాశనం చేశారని.. వాటిని గాడిలో పెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్నారన్నారు. నాటి చంద్రబాబు వంద రోజుల పాలన.. నేటి జగన్ వంద రోజుల పాలనపై బేరీజు వేసుకోవాలని ప్రజలకు సూచించారు. పీపీఎల పునఃసమీక్ష, పోలవరం రీ టెండరింగ్‌ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు.

అందుకే పెట్టుబడుదారులు పారిపోయారు..
అవినీతి, అక్రమాలు బయటపడతాయని చంద్రబాబుకు భయమా అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అవినీతి పరిపాలనతో పెట్టుబడిదారులు భయపడి పారిపోయారని పేర్కొన్నారు. తప్పులు జరిగితే.. సరిదిద్దుకుపోవాలని చంద్రబాబు చెప్పితే..తప్పును నిలదీయాలని వైఎస్‌ జగన్‌ అంటున్నారని..దీన్నిబట్టి చూస్తే ఎవరు నిజాయితీగా పాలన అందిస్తున్నారో అర్థం అవుతుందన్నారు. గత ఐదేళ్ల పాలనలో  రైతులకు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని  కూడా అమలు చేయని చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీని విమర్శించే హక్కు లేదన్నారు. అనంతపురం జిల్లాలో రైన్‌ గన్స్‌ తెచ్చి కోట్లు దోచుకున్నారని  దుయ్యబట్టారు.

చంద్రబాబూ..జైలు కెళ్లే రోజూ దగ్గరలోనే ఉంది..
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన బాబుకు విమర్శ చేసే హక్కు లేదన్నారు. చంద్రబాబుకు జైలు కెళ్లే రోజులు దగ్గర్లోనే  ఉన్నాయని జోస్యం చెప్పారు. వ్యాపార లావాదేవీలు చక్కదిద్దుకునే సుజనా చౌదరి.. వైఎస్సార్‌సీపీని  విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు ఎన్నుకున్న పార్టీని ప్రైవేట్‌ రాజ్యం అని ఆరోపించడం సిగ్గు చేటన్నారు. చట్టాన్ని చేతిలో పెట్టుకుని చంద్రబాబు పరిపాలించారని..కోడెల దోపిడీపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నా సిగ్గు రాలేదా అని ప్రశ్నించారు. జోక్ ప్యాక్ట్   తేడా తెలియని బాబు.. ప్రతిపక్ష హొదాలో ఉండటం సిగ్గు చేటన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా