టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వైఎస్ఆర్సీపీ నేత!

4 Jul, 2014 16:41 IST|Sakshi
గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ నేతలు దాడికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం జరిగిన దాడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శేషిరెడ్డికి తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.  టీడీపీ దాడిలో గాయపడిన శేషిరెడ్డిని పార్టీ నేతలు బ్రహ్మనాయుడుతోపాటు ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పరామర్శించారు. 
 
ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో టీడీపీ నేతలు దురుసుగా చొరబడి నామినేషన్‌ పత్రాలు లాక్కునేందుకు యత్నం చేయగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతోపాటు పోలీసులకు, ఎస్సైకు కూడా గాయాలయ్యాయి. 
మరిన్ని వార్తలు