టీడీపీవి  దెయ్యాల దీక్షలు

21 Apr, 2018 06:48 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న తమ్మినేని సీతారాం  

రూ.20 కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు

వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని 

శ్రీకాకుళం సిటీ : ప్రత్యేక హోదా విషయంలో రా్రష్రట ప్రజల ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టుపెట్టిన ముఖ్యమంత్రి, టీడీపీ నాయకులు ఇప్పుడు దీక్షలు చేయడం దెయ్యాలు వేదా లు వల్లించేలా ఉన్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధర్మపోరాటం పేరుతో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో దీక్ష చేస్తున్నారా లేక టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా దీక్ష చేపడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు.

చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై మాట్లాడే హక్కు లేదన్నారు. ఢిల్లీలో కాకుం డా ఇక్కడ దీక్షలు చేయడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబుది 420 దీక్షగా అభివర్ణించారు. ధర్మపోరా ట దీక్షకు రూ.20 కోట్ల ప్రభుత్వ, ప్రజాధనాన్ని దుర్విని యోగం చేశారని దుయ్యబట్టారు. మహిళా సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులను బలవంతంగా దీక్షలకు తరలించారని ధ్వజమెత్తారు. ప్రత్యేకహోదాకు మద్దతుగా పోరాడితే విద్యార్థులపై కేసులు పెట్టి జైలుకి పంపిస్తామని చెప్పి ఇప్పుడు దీక్షల్లో వారినే భాగస్వామ్యం చేస్తున్న మీకు అండమాన్, తీహార్‌లలో ఏ జైలు కు పంపించాలో మీరే చెప్పాలని ఎద్దేవా చేశారు.

టీడీపీ పాలనలో దళిత, గిరిజన భూములు ఆక్రమణకు గురవుతున్నాయని చెప్పారు. హామీలు అమలు చేయకపోవడం, ఫిరాయింపులను ప్రోత్సహించడం, వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ వంటి శాఖలను ముక్కలు చేíసి ఆరోగ్యశ్రీని చెట్టెక్కించడంతో పాటు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం ఏ త్యాగానికైనా వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 

సెక్షన్‌ 30 ఇప్పుడేమైంది?
శ్రీకాకుళం సబ్‌ డివిజన్‌లో సెక్షన్‌ 30ను అందరికి సమానంగా వర్తింపజేయాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం ఏడురోడ్ల కూడలి వద్ద మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు దీక్షలో కూర్చొంటే సెక్షన్‌ 30 ఎక్కడికెళ్లిందని పోలీసులను ప్రశ్నించారు. తాము దీక్షలు చేపట్టిన సందర్భాల్లో గృహ నిర్బంధాలు, దీక్షలు భగ్నం చేయడం, అరెస్టులు వంటివి చేశారని గుర్తు చేశారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎన్ని ధనుంజయ్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు