వైఎస్సార్‌సీపీ నేత ఉదయభాను అరెస్ట్

7 May, 2015 16:58 IST|Sakshi

జగ్గయ్యపేట(కృష్ణా జిల్లా): ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిలిచిన వైఎస్సార్‌సీపీ నేత ఉదయభానును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన గురువారం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని ఆర్టీసీ డిపో వద్ద జరిగింది. వివరాల ప్రకారం.. సమ్మె నేపథ్యంలో జగ్గయ్యపేట ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడిపేందుకు ప్రయత్నించింది. అయితే ఈ కార్యక్రమాన్ని ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. వీరికి వైఎస్సార్‌సీపీ నేత ఉదయభాను మద్దతుగా నిలిచారు. అందరూ కలిసి డిపో ఎదురుగా బైఠాయించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఉదయభానును అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

తిరువూరులో...


తిరువూరులో ఆర్టీసీ డిపోలో నుంచి బయటకు వస్తున్న బస్సులను ఆ సంస్థ కార్మికులు అడ్డుకుని డిపో ముందు ఆందోళనకు దిగారు. దీంతో డిపో వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న 13 మంది కార్మికులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు