‘వైఎస్సార్‌ పాలన గుప్తుల కాలాన్ని గుర్తు చేసింది’

8 Jul, 2020 10:01 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: జిల్లా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్‌ కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ‘దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన గుప్తుల కాలాన్ని మరిపించింది. వైఎస్సార్‌ హయాంలో రైతుల సంక్షేమానికి బాటలు పడ్డాయి. 22 లక్షల హెక్టార్ల కు సాగు నీరు అందించి భూములను సస్యశ్యామలం చేశారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగ అంటే వ్యవసాయం పండగ అని నిరూపించిన ఘనుడు రాజశేఖరరెడ్డి. 32 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేశారు. 26 లక్షల ఎకరాల్లో అటవీ భూములపై ఆదివాసీలకు హక్కు కల్పించిన ఘన చరిత్ర వైఎస్సార్‌ది.

108, 104 వాహనాలు సమకూర్చి ప్రజలను ఆదుకున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని వైఎస్సార్‌‌ ద్వారానే సాధ్యమైంది. మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. వైఎస్‌ రాజశేఖరెడ్డి పాలనా కాలం స్వర్ణయుగమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వైఎస్సార్‌ చెరగని ముద్ర వేశారని చెప్పారు. ఆయన చేసిన అభివృద్ధి ఫలాలు ఇప్పటికీ ప్రజలను ఆదుకుంటున్నాయని తెలిపారు. వైఎస్సార్‌ జయంతి కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, అన్నం రెడ్డి అదిఫ్ రాజ్, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు ఎస్‌ఏ రెహమాన్, కుంభా రవిబాబు,  విశాఖ ఉత్తరం కన్వీనర్ కె.రాజు, పార్టీ సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకటరావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు