సైనికుల్లా పని చేయాలి

20 Nov, 2018 08:38 IST|Sakshi
పి.గన్నవరం నియోజకవర్గ బూత్‌ కమిటీల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయమే లక్ష్యంగా కదలాలి

ఉభయ గోదావరి జిల్లాల రీజినల్‌ కో ఆర్డినేటర్‌ సుబ్బారెడ్డి పిలుపు

తూర్పుగోదావరి, నాగుల్లంక (పి.గన్నవరం): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి రాక్షస, దోపిడీ పాలనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు జననేత జగన్‌కు మద్దతు పలుకుతున్నారని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించేందుకు బూత్‌ కమిటీలు, కార్యకర్తలు ఇప్పటినుంచే సైనికుల్లా పని చేయాలని ఉభయ గోదావరి జిల్లాల రీజినల్‌ కో ఆర్డినేటర్, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. నాగుల్లంక గ్రామంలోని కృష్ణబాలాజీ కన్వెన్షన్‌ హాలులో పార్టీ కో ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు అధ్యక్షతన సోమవారం జరిగిన పి.గన్నవరం నియోజకవర్గ బూత్‌ కమిటీల విస్తృత స్థాయి సమావేశంలో సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో బూత్‌ కమిటీలు నిర్వహించాల్సినపాత్రపై ఆయన దిశానిర్దేశం చేశారు.

నవరత్న పథకాలతో రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి కలిగే లబ్ధిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు.  అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో సుమారు 20 వేల ఓట్లను తొలగించేందుకు అధికార పార్టీ దృష్టి సారించిందని, బూత్‌ కమిటీలు దీన్ని ఎదుర్కోవాలన్నారు. పీఏసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బూత్‌ కమిటీలు కీలకపాత్ర పోషించి విజయ పతాకను ఎగురవేయాలని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల బూత్‌ కమిటీల అధ్యక్షులు బీవీఆర్‌ చౌదరి, అమలాపురం పార్లమెంటరీ జిల్లా బూత్‌ కమిటీల అధ్యక్షుడు ఒమ్మి రఘురాం మాట్లాడుతూ కొత్త ఓట్ల నమోదుపై దృష్టి సారించాలని, బూత్‌ కమిటీలు ప్రజలకు చేరువ కావాలని సూచించారు. కో ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ మోసకారి చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెప్పాలని అన్నారు.

అత్యధిక మెజార్టీతో చిట్టిబాబును గెలిపించాలి..
రాబోయే ఎన్నికల్లో పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కో ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబును జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైవీ సుబ్బారెడ్డి కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. తొలుత చాకలిపాలెం సెంటర్లో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, దివంగత సీఎం రాజశేఖర రెడ్డి విగ్రహాలకు సుబ్బారెడ్డి పూల మాలలు వేసి, నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మిండగుదిటి మోహనరావు, చెల్లుబోయిన శ్రీనివాస్, కర్రి పాపారాయుడు, పి.కె.రావు, నక్కా వెంకటేశ్వరరావు, కొమ్ముల రాము, మట్టపర్తి శ్రీనివాస్, వాసంశెట్టి చినబాబు, మంతెన రవిరాజు,  కశిరెడ్డి అంజిబాబు, కొండేటి వెంకటేశ్వర రావు, పితాని నర్శింహ రావు, నాగవరపు నాగరాజు, గన్నవరపు శ్రీనివాస్, వాకపల్లి వీరాస్వామి, కొల్లి నిర్మలాకుమారి, కాశి మునికుమారి, కొమ్ముల కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు