రానున్నది రాజన్న రాజ్యమే

19 Nov, 2018 09:07 IST|Sakshi
జననేత జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు 300 రోజులు పూర్తయిన సందర్భంగా జగదాంబ కూడలిలో కేక్‌ కట్‌చేసిన వైఎస్సార్‌ సీపీ నేతలు

చరిత్ర సృష్టించిన జననేత జగన్‌

ప్రజా సంకల్ప యాత్ర చరిత్రలో ఓ మైలు రాయి

యాత్ర 300 రోజులు పూర్తి కావడంతో ప్రత్యేక కార్యక్రమాలు

సంబరాల్లో వైఎస్సార్‌ సీపీ నేతలు

పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): రాష్ట్ర ప్రజానీకం కొద్ది రోజులు ఓపిక పడితే  తిరిగి రాజన్న రాజ్యం వస్తుందని వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొన్నారు. జననేత, వైఎస్సార్‌సీపీ అ«ధ్యక్షుడు  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  నిర్వహిస్తున్న ప్రజా సంకల్పయాత్ర ఆదివారం నాటికి 300 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసకున్నాయి.  దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ పైడి వెంకట రమణమూర్తి ఆధ్వర్యంలో జగదాంబ కూడలిలో ఉన్న  మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌చేసి, 300 బెలూన్లు ఎగురవేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల చంద్రబాబు రాక్షస పాలనతో ప్రజలు విసిగివేసారిపోయారన్నారు. హత్యారాజకీయాలు, భూకుంభకోణాలు, అక్రమాలు, అవినీతి తారాస్థాయికి చేరాయని ఎద్దేవా చేశారు.  సంక్షేమ పథకాలు, విద్యా, వైద్యం వంటివి సామాన్య, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి అకుంఠిత దీక్ష, అవిశ్రాంత పరిశ్రమ, రాష్ట్ర ప్రజలమీద పాలనమీద ఆయనకు ఉన్న ఆలోచనలే రాష్ట్రానికి త్వరలో స్వర్ణయుగం తీసుకురానున్నాయని ధీమా వ్యక్తం చేశారు.  ప్రపంచంలో ఏ ఒక్కనాయకుడు చేయని విధంగా సుదీర్ఘమైన పాదయాత్రను జగనన్న చేస్తున్నారని కొనియాడారు. ఎండా, వానలను లక్ష్యపెట్టకుండా, కుటుంబానికి దూరంగా ఉంటూ, ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జగనన్న చేపట్టిన పాదయాత్ర  ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుంది.  

ఆనాడు దివంగతనేత వైఎస్‌ , తర్వాత షర్మిలమ్మ, ప్రస్తుతం జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తున్నారని, ఒకే కుటుంబానికి చెందిన నేతలు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా  ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సుదీర్ఘంగా పాదయాత్ర చేయడం ఎక్కడా జరగలేదన్నారు.  కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, విశాఖ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్‌ , విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త ఎం.వి.వి.సత్యనారాయణ, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి జాన్‌వెస్లీ, నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మారోజు శ్రీనివాస్, నగర యువజన విభాగం అధ్యక్షుడు కొండ రాజీవ్‌ గాంధీ, సనపల రవీంద్ర భరత్, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సబీరా బేగం, నియోజకవర్గ అధికార ప్రతినిధి గుత్తుల నాగభూషణం, ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి బోనిదేవ  రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి కనకల ఈశ్వరరావు,  రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి ఆదివిష్ణురెడ్డి, నియోజకవర్గం మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు ముజీబ్‌ఖాన్, వార్డు అధ్యక్షులు పీతల వాసు, దశమంతుల మాణిక్యాలరావు, నొల్లు పోతురాజు, మాసిపోగు రాజు, సంకాబత్తుల సన్యాసిరావు, సూరాడ తాతారావు, అలుపన కనకరెడ్డి, బత్తిన నాగరాజు, రంథి గోపి, తొట పద్మావతి, నీలాపు సర్వేశ్వరరెడ్డి, రామిరెడ్డి, జుబేర్, మైఖెల్‌రాజు, మహిళా అధ్యక్షురాలు నీలాపు లక్ష్మి, నగర కార్యదర్శులు పడాల విజయకుమార్, ఇల్లిపిల్లి శ్రీను, పార్లమెంట్‌ జిల్లా కార్యదర్శి అడప శివ, సంయుక్త కార్యదర్శి బెవర మహేష్, వార్డు యూత్‌ అధ్యక్షులు కోరాడ సురేష్, నొల్లు చంటి, కార్యదర్శి ఎస్‌.చంద్రశేఖర్, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు కాకర కనకరాజు, ఆకుల హజార్, వార్డు మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు జమీల్, బీసీ సెల్‌ అధ్యక్షుడు ప్రధాన శత్రువు, ఎస్సీసెల్‌ అధ్యక్షుడు చెన్నాసాయి, మహిళా అధ్యక్షురాలు కాకి పద్మ, సేవాదళ్‌ అధ్యక్షుడు గొంప భాను, యూత్‌ అధ్యక్షుడు కోరుకొండ ప్రసాద్, మారోతి శ్రీను, వల్లి శ్రీను, పార్లమెంట్‌ జిల్లా సంయుక్త కార్యదర్శి రామకృష్ణ, నగర సంయుక్త కార్యదర్శి హరి, వార్డు యువజన విభాగం అధ్యక్షుడు సీహెచ్‌.అప్పలరాజు, నగర కార్యదర్శి అర్జిల్ల మసేను, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజాసంకల్పయాత్ర చరిత్రాత్మకం
ఏయూక్యాంపస్‌(విశాఖ తూర్పు): రాష్ట్ర ప్రజలతో మమేకమవుతూ వైఎఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర చరిత్రలో ఓ మైలు రాయిగా నిలిచిపోతుందని వైఎస్సార్‌ఎస్‌యూ విశాఖ పార్లమెంట్‌ విభాగం అధ్యక్షుడు బి.కాంతారావు అన్నారు. ప్రజా సంకల్పయాత్ర 300 రోజుకు చేరుకున్న సందర్భంగా  ఏయూలోని వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద ఆదివారం కేక్‌ కట్‌ చేసి వేడుకలు నిర్వహించారు. ఏడాదిగా  ప్రజల మధ్యనే ఉంటూ, ప్రజల పక్షాన నిలుస్తూ జగన్‌ మోహన్‌ రెడ్డి చేస్తున్న పాదయాత్ర చరిత్రలో నిలుస్తుందన్నారు. మహానేతలోని లక్షణాలను పుణికిపుచ్చుకుని ప్రజలకోసం నిరతంరతం పరితపిస్తూ చేస్తున్న పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలంతా జగన్‌చేస్తున్న పాయదాత్రకు సంఘీభావం చెబుతున్నారన్నారు. దీన్ని నిలువరించాలని, అడ్డుకోవాలని చూస్తున్నా ప్రజల అండతో విజయవంతంగా కొనసాగుతోందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు బి.మోహన్‌ బాబు, కోటి రవికుమార్, ఎం.కళ్యాణ్, విద్యార్థి నాయకలు  పి.సుధీర్‌ పాల్, క్రాంతి కిరణ్, రంజిత్, పవన్, రమేష్, శంకర్, నవీన్, నిషేక్, లీలాక్రిష్ణ, మని, అజయ్, విజయక్రిష్ణ, వినోద్, వెంకటేష్, సంజీవ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు