రాక్షసపాలనకు చరమగీతం పాడుదాం

29 Oct, 2017 13:48 IST|Sakshi

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : రాష్ట్రంలో సాగుతున్న రాక్షసపాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఆసన్నమైందని ఆ పార్టీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో శని వారం అనుబంధ సంఘాల (బీసీ, ఎస్సీ, రైతు, యువజన, విద్యార్థి, మహిళ) బలోపేతానికి, మండలస్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి సభ్యుల ఎంపిక కోసం సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొలుత నాయకులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  కార్యక్రమంలో నియోజకవర్గ  

సమన్వయకర్తలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఉషశ్రీచరణ్, కేతిరెడ్డి పెద్దారెడ్డి, డా.సిద్ధారెడ్డి, డా.తిప్పేస్వామి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి, రాయలసీమ డివిజన్‌ అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, మాజీ మేయర్‌ రాగే పరుశురాం, నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి,  మీసాల రంగన్న, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు వీరాంజనేయులు, రామలింగారెడ్డి, నాగిరెడ్డి, మల్లయ్య యాదవ్, చీమల నాగేష్, సుశీలమ్మ, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

జగన్‌ను సీఎం చేయాలి : కేంద్ర పరిశీలకులు చల్లా మధుసూదన్‌రెడ్డి పార్టీని ఆరు విభాగాల్లో బలోపేతం చేయడం కోసం మండలస్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి వరకు ప్రతి విభాగానికి ముగ్గురు సభ్యుల్ని ఎంపిక చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ పార్టీని తమ భుజస్కంధాలపై వేసుకుని జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయాలి.

నిరంకుశపాలన సాగుతోంది : బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, జంగా కృష్ణమూర్తి 
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వివిధ విభాగాలకు పార్టీ నిర్మాణంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. పార్టీని సుస్థిర, వ్యవస్థాపకంగా నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా నిరంకుశ పాలన సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ దోచుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. గ్రామాల్లో భయపెట్టి పార్టీలోకి చేర్చుకుంటున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. 

కలిసికట్టుగా పార్టీని ముందుకు నడపాలి : శంకర్‌నారాయణ 
పార్టీ బలోపేతమే లక్ష్యంగా రైతు, యువత, విద్యార్థి, మహిళ, బీసీ, ఎస్సీ సంఘాలను కలిసికట్టుగా చేసుకుని పార్టీని ముందుకు నడిపించాలి. 

అన్ని వర్గాల వారూ అసంతృప్తితో ఉన్నారు : ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి 
ఈ ప్రభుత్వం 600 అబద్ధాలతో అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని వర్గాల వారు అసంతృప్తితో ఉన్నారు. 

త్వరలో బీసీ డిక్లరేషన్‌ : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిష్టప్ప
పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేయాలి.  త్వరలో బీసీ డిక్లేరేషన్‌ను ప్రకటిస్తారన్నారు. ప్రతి వ్యక్తికి వైఎస్సార్‌ పార్టీ నాది అనే భావనతో పని చేయాలి. యువతను ప్రభుత్వం మోసం చేసింది. ఉద్యోగాలు రాక అనేకమంది యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.   

పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలి :రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి 
గ్రామ, మండల స్థాయి నుంచే పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలి. అవినీతిలో కూరుకుపోయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ ఫలాలను అందించడంలో విఫలమయ్యాయి. వైఎస్సార్‌ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేసి ఓట్లుగా మలుచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. 

తిరుగులేని శక్తిగా మారాల్సిన అవసరం ఉంది : ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి 
వచ్చే అక్టోబర్‌లో ముందస్తు ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్నంత ప్రజాకర్షణ ఈ ప్రపంచంలో ఏ నాయకుడికి లేదు. వేలాది మంది అభిమానం ఉన్నా గత ఎన్నికల్లో ఓడిపోయాం. తిరుగులేని శక్తిగా మారాల్సిన అవసరం ఉంది. జగన్‌ పాదయాత్రను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు