‘గండికోటకు చుక్కనీరు ఎందుకివ్వడం లేదు’

4 Sep, 2018 18:55 IST|Sakshi

సాక్షి, కడప : వైఎస్‌ఆర్‌ జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయని వైఎస్సార్‌సీపీ నేతలు రవీంద్రనాథ్ రెడ్డి, సురేష్ బాబులు అన్నారు. రాష్ట్రంలోనే అత్యంత తక్కువ వర్షపాతం కడపలో ఉందని పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చినా, నాగార్జున సాగర్‌కు కూడా నీరు విడుదల చేస్తున్నారన్నారు. అయినా గండికోటకు ఎందుకు చుక్కనీరు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

కడప జిల్లాకు చుక్క నీరు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వమని రవీంద్రనాథ్ రెడ్డి, సురేష్ బాబులు మండిపడ్డారు. ప్రభుత్వం తాత్సారం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. వరద సమయం పూర్తి అవ్వక ముందే గండికోటకు 10 వేల కూసెక్కులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బ్రహ్మంసాగర్‌కు సరిపడా నీళ్లు విడుదల చేయాలన్నారు. ఆగస్ట్ 30లోపు కేంద్రం స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు ఉలుకూ పలుకూ లేకుండా చంద్రబాబు ఉన్నారని ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు