27న వైఎస్సార్‌ సీపీ సమావేశం

26 Feb, 2017 22:56 IST|Sakshi

శ్రీకాకుళం అర్బన్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన, రైతు, మహిళ, విద్యార్థి విభాగాల ప్రతినిధులతో ఈ నెల 27న సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులు ప్రకటించారు. శ్రీకాకుళంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ వ్యవసాయ విభాగం జిల్లా అధ్యక్షుడు గొండు రఘురాం సమావేశ వివరాలు వెల్లడించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, సాగి ప్రసాదరాజు ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలోనే సమావేశం జరుగుతుందన్నారు. పార్టీ వ్యవసాయ విభా గం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, పార్టీ మ హిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్‌.కె.రోజా, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు తదితరులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. 38 మండలాలు, ఆరు మున్సిపాలిటీలకు సంబంధించి కమిటీలు వేయనున్నట్లు వెల్లడించారు.

పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేం దుకు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు కమిటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. యువజన, మహిళా, రైతు, విద్యార్థి విభాగాల ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని పిలపునిచ్చారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రధాన రాజేంద్ర మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. నిరుద్యోగ భృతి పేరిట మోసం చేయడంతో యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు చింతాడ మంజు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా మహిళలను నమ్మించి నట్టేట ముంచారన్నారు.  సమావేశంలో పార్టీ నేతలు పడపాన సుగుణారెడ్డి, కోరాడ రమేష్, బగాది హరి, చింతాడ దిలీప్, బిడ్డిక లక్ష్మి, కె.చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు