ఏపీ చరిత్రలో నేడు కొత్త శకానికి నాంది

1 Jul, 2020 12:36 IST|Sakshi

1088 అంబులెన్సుల ప్రారంభంపై ప్రశంసలు కురిపించిన వైఎస్సార్​సీపీ నాయకులు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరు అద్భుతమని వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ చీఫ్ విప్​ శ్రీకాంత్ రెడ్డి కొనియాడారు. ఇచ్చిన ప్రతిమాటను సీఎం నిలబెట్టుకుంటున్నారని చెప్పారు. మాజీ సీఎం చంద్రబాబు గ్రాఫిక్స్​తోనే అంతా అయిపోయినట్లుగా చూపించారని విమర్శించారు. ఆయన హయంలో 108 వాహనాలు మూలన పడ్డాయని దుయ్యబట్టారు. (సీఎం జగన్‌ కృషి.. సుదీర్ఘ స్వప్నం సాకారం)

అత్యాధునిక సాంకేతిక​ పరిజ్ఞానంతో 108, 104 వాహనాలను తీసుకురావాలనే గొప్ప ఆలోచన సీఎం జగన్​దేనని చెప్పారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు ఇకనైనా హుందాగా వ్యవహరించాలని సూచించారు. ‘ఏపీ చరిత్రలో నేడు కొత్త శకానికి నాంది పలికిన రోజు. ఏపీ ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే మా లక్ష్యం. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మాది చేతల ప్రభుత్వమని నిరూపిస్తున్నాం’ అని ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు సీఎం వైఎస్​ జగన్ పాలనను ప్రశంసించారు. (1.15 లక్షల మందికి కొత్తగా పెన్షన్)

‘పేద ప్రాణాలను కాపాడేందుకు దివంగతనేత వైఎస్సార్ నాడు 108 అంబులెన్స్​లను ప్రారంభించారు. ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ నేడు వాటిని అపర సంజీవినిలుగా రూపుదిద్దారు. పేదల ప్రాణాలకు భరోసా కల్పించేలా ఆరోగ్య వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు’ అని ఎమ్మెల్యే జోగిరమేష్ కొనియాడారు.

మరిన్ని వార్తలు