‘చంద్రబాబు బుద్ధి మారాలి’

8 Feb, 2020 14:30 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రం అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధి వికేందీకణ నిర్ణయాన్ని తీసుకున్నారు.  ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తూ రాజకీయాలు చేస్తున్నారు. అయితే మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు, విద్యార్థి సంఘాల నేతలు రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు బుద్ధి మారాలని భగవంతున్ని కోరుకున్నారు.

విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు నాయుడులో మార్పు రావాలని కోరుతూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నేతలు వినాయక ఆలయం వద్ద కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు, పార్టీ నగర కన్వీనర్ శ్రీనివాస్, వంశీకృష్ణ, ఈస్ట్ కన్వీనర్ విజయ నిర్మల, విద్యార్థి విభాగం అధ్యక్షుడు బి. కాంతారావు, పార్టీనేతలు కొయ్య ప్రసాద్‌రెడ్డి, రోంగలి జగన్నాథం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

విశాఖపట్నం: చంద్రబాబుకు మంచి బుద్దిని ప్రసాదించాలని ఎమ్మెల్యే గొల్ల బాబురావు వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిoచారు. విశాఖ ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులకు మద్దతుగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు ఆధ్వర్యంలో 34 వార్డు ప్రజలు, కార్యకర్తలు తాటిచెట్లపాలెం ఆంజనేయ స్వామిగుడిలో చంద్రబాబుకి మంచి బుద్ధి ప్రసాదించాలని దేవునికి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. 

పశ్చిమ గోదావరి: తాడేపల్లిగూడెంలో మూడు రాజధానులకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు అయిదవ రోజు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ పాల్గొని రిలే నిరాహార దీక్ష చేస్తున్నవారికి మద్దతు తెలిపారు. తణుకులో మూడు రాజధానులకు మద్దతుగా ఐదవ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. రిలే నిరాహార దీక్ష చేస్తున్నవారికి ఆయన సంఘీభావం తెలిపారు.

ప్రకాశం: మూడు రాజధానులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో లాయర్‌పేట సాయిబాబా గుడిలో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, బీసీ సెల్ నాయకులు కాటరీ శంకర్, ఒంగోలు యూత్ ప్రెసిడెంట్ రామానాయుడు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. మూడు రాజధానులు, అభివృద్ధి వికేంద్రీకరణతోనే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి సాధ్యమని వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు.. దర్శిపొదిలి రోడ్డులోని దధాలమ్మ గుడిలో చంద్ర‌బాబుకి మంచి బుద్ధి ప్ర‌సాదించాల‌ని దేవునికి ప్రార్ధ‌న‌లు చేసి కొబ్బరి కాయలు కొట్టారు. 

ప్రకాశం: అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటును కనిగిరి సాయిబాబా గుడిలో వైఎస్సార్‌సీపీ నాయకులు టెంకాయలు కొట్టి తమ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగనాయకులురెడ్డి, బన్ని, మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, సుజాత పాల్గొన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు మంచి బుద్ధితో పాటు మంచి మాటలు ప్రసాదించాలని కొండేపి నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇంచార్జి డాక్టర్ వెంకయ్య.. పొన్నలూరు దర్గాలో ముస్లీంలతో కలసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

గుంటూరు: చంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించాలంటూ వైసస్సార్‌సీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో..పార్టీ నాయకులు 101 కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు వికేంద్రీకరణకు మద్దతుగా నినాదాలు చేశారు.

అనంతపురం:అభివృద్ధి వికేంద్రీకరణకు మద్ధతుగా..  చంద్రబాబు నాయుడుకి మంచి బుద్ధి ప్రసాదించాలని మడకశిర సాయిబాబా గుడిలో ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీకాకుళం: రాజాంలో పోలిపల్లి పైడితల్లి అమ్మవారి దేవాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చిన పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయానికి అడ్డుపడుతున్న చంద్రబాబు నాయుడి బుద్ధి మారాలని ఎమ్మెల్యే కంబాల జోగులు పత్యేక పూజలు చేశారు.

కర్నూలు: ఆదోని ఆంజనేయ స్వామి దేవాలయంలో చంద్రబాబు నాయుడుకి మంచి బుద్ధి ప్రసాదించాలని వైఎస్సార్‌సీపీ నేతలు, పార్టీ కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు. 

వైఎస్ఆర్: బద్వేలులో అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా వెంకటేశ్వరస్వామి దేవాలయంలో 101 టెంకాయలు కొట్టి చంద్రబాబుకు మంచి బుద్ధి రావాలని వైఎస్సార్‌సీపీ నాయకులు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకటసుబ్బయ్య, పార్టీ నేతలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు