దోపిడీ పాలన

17 Dec, 2018 07:34 IST|Sakshi

శ్రీకాకుళం ,నరసన్నపేట, సారవకోట, జలుమూరు, పోలాకి: టీడీపీ ప్రభుత్వ నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజలను దోచుకున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. నరసన్నపేట నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం ప్రజా సంకల్ప యాత్ర బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కింది స్థాయి నేత నుంచి పెదబాబు వరకు అంతా దోపిడీలో భాగస్వాములేనని ఆరోపించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు రూ.95వేల కోట్ల అప్పులు ఉంటే దాన్ని రూ1.25 లక్షలకు పెంచి, టీడీపీ పెద్దలు మాత్రం తమ ఆస్తులు పెంచుకున్నారని అన్నారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిపై టీడీపీ నాయకులు మొ దటి నుంచీ వివక్ష చూపిస్తూనే ఉన్నారని తెలిపారు. మండువేసవిలోనూ నీరు ఇచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ హయాంలో చదువుకున్న వారికి ఎవరికీ ఉద్యోగాలు రావడం లేదని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని టీడీపీ నిర్వీర్యం చేస్తుంటే దాన్ని బతికించేందుకే జగన్‌ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు.

ఇది రాక్షస పాలన
రాష్ట్రంలో రాక్షస పా లన సాగుతోందని పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం అన్నారు. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో 612 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్కదాన్ని కూడా సక్రమంగా అమలు చేయలేదని తెలిపారు. జాబు కోసం ఎదురుచూసిన నిరుద్యోగులు ఇప్పుడు బాబు ఎప్పుడు దిగిపోతారా అని నిరీక్షిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ టీడీపీ నాయకులు 23 మంది ఎమ్మెల్యేలను కొన్నారని, వీరి హయాంలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయాయని విమర్శించారు. రాజకీయాల్లో విలువలకు వైఎస్సార్‌ సీపీ ఎల్ల ప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు.

జగన్‌ ప్రభంజనం
రాష్ట్రంలో జగన్‌ ప్ర భంజనం నడుస్తోం దని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ రా జకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. రానున్నది మనందరి ప్రభుత్వమని, మీ అందరి సమస్యలు తీర్చే రోజు దగ్గరలోనే ఉందని తెలిపారు. రాష్ట్రం ప్రగతిలో వెనుకబడితే టీడీపీ నాయకులు మాత్రం ఆదాయంంలో ముందంజలో ఉన్నారని విమర్శించారు. తిత్లీలో నష్టపోయిన వారిని ఆదుకోవాల్సింది పోయి అందిన కాడికి దోచుకున్నారని ఆరోపించారు. పద్మప్రియ మాట్లాడుతూ మన అందరి కష్టాలు తీరాలంటే జగన్‌ ముఖ్య మంత్రి అవ్వడం ఒక్కటే మార్గమన్నారు.   

తుఫాన్‌ నిధుల దారి మళ్లింపు
మంత్రి అధికార బ లంతో ఆగడాలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ అన్నారు. తిత్లీ సమయంలో ఆదుకోవాల్సిన మంత్రి అచ్చెన్నాయుడు తుఫాన్‌ నిధులను సైతం దారి మళ్లించారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు