ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన వైఎస్సార్సీపీ నేతలు

29 Jul, 2017 19:10 IST|Sakshi

హైదరాబాద్‌: వైఎస్సార్సీపీ నేతలు చల్లా మధుసూధన్‌రెడ్డి,  ఉమా మల్లేశ్వరరావులు శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను కలిశారు. రాష్ట్రంలో నంద్యాల ఉపఎన్నిక నేపథ్యంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులపై ఆయనతో చర్చించారు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం భారీ అక్రమాలకు పాల్పడుతోందని భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం భారీ అవినీతికి పాల్పడుతోందని తెలిపారు.

ఇందుకోసం భారీ స్థాయిలో కొత్త ఓట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. జనవరి 1నుంచి జులై 28 వరకూ సుమారు 16వేల కొత్త ఓట్ల కోసం తెలుగుదేశం నేతలు నకిలీ దరఖాస్తు చేశారని ఫిర్యాదు చేశారు. దరఖాస్తులన్నీ ఒకే ఐపీ అడ్రస్‌ నుంచి జరిగాయని తెలిపారు. వీటన్నింటినీ వెరిఫికేషన్‌ జరిపించాలని, అర్హులకు మాత్రమే కొత్త ఓటరు​కార్డులు జారీ చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు