‘ఆయన చంద్రబాబు జేబులో మనిషే’

21 Apr, 2020 17:43 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

సాక్షి, విజయవాడ: కరోనాపై కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయ విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయని.. నియంత్రణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా కట్టడికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
(లక్ష్మీనారాయణా.. సమాధానం చెప్పు)

ఎన్నికల ఫండ్‌ను కొట్టేశారో లేదో చెప్పాలి..
‘‘కాంగ్రెస్‌ నుంచి బీజేపీకి జంప్‌ అయిన నేత కన్నా లక్ష్మీనారాయణ.. ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదం. బీజేపీలో అధ్యక్షుడిగా ఇవ్వడం లేదని వైఎస్ఆర్‌సీపీలో చేరాలనుకోలేదా? చంద్రబాబుకు రూ.20 కోట్లకు అమ్ముడు పోయి ఇప్పుడు మాపై విమర్శలా?. కన్నా.. చంద్రబాబు జేబులో మనిషి. 20 కోట్లు ఇచ్చి కాంగ్రెస్‌లో సీఎం పదవి కొనుక్కోవాలని ప్రయత్నించలేదా? బీజేపీ ఎన్నికల ఫండ్‌ను కన్నా కొట్టేశారో లేదో చెప్పాలి. గత ఏడాది ఏప్రిల్ 24న నిజంగానే గుండెపోటు వచ్చిందా? 2019లో బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికల ఫండ్‌ను సద్వినియోగం చేశావా?’ అంటూ విమర్శలు గుప్పించారు.
(ఆకాశంపై ఉమ్మేయొద్దు : విజయసాయిరెడ్డి)

ఎందుకు ప్రశ్నించడం లేదు..?
వందల కోట్లు సంపాదించుకోడానికి రాజకీయ అవినీతి చేయలేదని.. చంద్రబాబుకు అమ్ముడుపోలేదని కన్నా ప్రమాణం చేయాలని అంబటి డిమాండ్‌ చేశారు. ఈ ఐదు ప్రశ్నలకు సమాధానం చెబితే కాణిపాకంలో ప్రమాణం చేయడానికి తాము సిద్ధమని ఆయన సవాల్‌ విసిరారు. కేంద్రం కొనుగోలు చేసిన ధర కంటే తక్కువకే ర్యాపిడ్‌ కిట్లు కొనుగోలు చేశామన్నారు. కర్ణాటక రాష్ట్రం కూడా 790కే కొనుగోలు చేసిందని.. వాటిని కన్నా లక్ష్మీ నారాయణ ఎందుకు ప్రశ్నించడం లేదో సమాధానం చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా