‘చంద్రబాబుకు దొంగను పరామర్శించడానికి టైం ఉంది’

15 Jun, 2020 14:17 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: పేదల సొమ్మును టీడీపీ ఎమ్మెల్యే అచ్చెంనాయుడు, కొందరు అధికారులు పందికొక్కుల్లా తిన్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాధ్‌ ధ్వజమెత్తాడు. సోమవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాక ఎల్జీ పాలిమర్స్‌ బాధితులను పరామర్శించడానికి టైం దొరకని చంద్రబాబుకు, ఒక దొంగను అరెస్ట్‌ చేస్తే పరామర్శించడానికి టైం దొరికిందా అని ప్రశ్నించారు. అచ్చెంనాయుడు అరెస్ట్‌ను కిడ్నాప్‌గా అభివర్ణిస్తూ, రాజకీయం చేసి కులాలకు ఆపాదించారని, అవినీతికి కులం, మతం ఉండదని చంద్రబాబుకు తెలుసన్నారు. చంద్రబాబు హయంలో హెచ్‌పీసీఎల్‌, ఒఎన్‌జీసీ ఘటనలు జరిగిన బాధితులకు ఒక్క పైసా సాయం కూడా చేయలేదని ధ్వజమెత్తారు. (ఎల్జీ గ్యాస్ లీక్ ఘటనపై సుప్రీంకోర్టు విచారణ)

తన సొంత ప్రయోజనాల కోసం, పబ్లిసిటీ కోసం గోదావరీ పుష్కరాల్లో 29 మందిని బలితీసుకున్నా టీడీపీ తరుపున ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఎల్జీ పాలీమర్స్‌ బాధిత ప్రాంతంలో నివసిస్తున్న 20 వేల జనాభాను ఆదుకుందన్నారు. టీడీపీ హయాంలో జరిగిన ఆరు లక్షల కోట్ల అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టామన్నారు. తాను చేసిన అరాచకాలు, అన్యాయాలు మర్చిపోయి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబుకు ప్రజల మీద ఉన్నది సవతి ప్రేమ అని, ఆయన అక్రమాలను తెలుగు ప్రజలు మర్చిపోరు అని అన్నారు. మొన్న మహానాడునను జూమ్‌ యాప్‌లో చేసుకున్న చంద్రబాబు వచ్చే ఏడాది జైలులో చేసుకోవాల్సిందే అని అమర్‌నాధ్‌ ఎద్దేవా చేశారు. (అఖిలప్రియ సోదరుడి దౌర్జన్యం)

మరిన్ని వార్తలు