వైఎస్సార్‌కు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం

2 Sep, 2019 08:21 IST|Sakshi
వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్నరాష్ట్ర కాపు కార్పొరేషన్‌ చైర్మన్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా 

సాక్షి, కోరుకొండ(తూర్పుగోదావరి) : పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అందరి హృదయాల్లో కొలువై ఉన్నారని కాపు కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కొనియాడారు. సోమవారం వైఎస్సార్‌ వర్ధంతిని పురస్కరించుకుని జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గ్రామంలోని శ్రీ వల్లీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళా వేదిక వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ప్రారంభించారు. నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో తొలుత వైఎస్సార్, జక్కంపూడి రామ్మోహనరావుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యఅతిథిగా కాపు కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ వైఎస్సార్‌ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని చెప్పారు. వైఎస్సార్‌ వర్ధంతి సోమవారం అయినప్పటికీ ఆదే రోజు వినాయక చవితి పర్వదినం రావడంతో ఒక రోజు ముందే ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.  

జగన్‌ పాలనలో అందరికీ మేలు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు. పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఆయన అమలు చేస్తున్నారని రాజా చెప్పారు. వైఎస్సార్‌ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నవరత్న పథకాల అమలు ద్వారా ప్రజలకు సమక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. అతి త్వరలోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందని తెలిపారు. గ్రామాల్లోని పేదలకు మంచి వైద్యం అందించాలనే ఉద్ధేశంతో నియోజకవర్గ స్థాయిలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. శిబిరంలో వైద్యులు రోగులను పరీక్షించి మందుల పంపిణీ చేశారు. వైద్య శిబిరం విజయవంతానికి కృషి చేసిన అందరికీ జక్కంపూడి విజయలక్ష్మి ధన్యవాదాలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ వుల్లి బుజ్జిబాబు, గాదరాడ ఓం శివశక్తి పీఠం ధర్మకర్త బత్తుల బలరామకృష్ణ, పార్టీ వివిధ విభాగాల నాయకులు      తిరుమలశెట్టి సత్యనారాయణ, బొరుసు బద్రి, తాడి హరిశ్చంద్రప్రసాద్‌రెడ్డి, అరిబోలు చినబాబు, యర్రంశెట్టి పోలారావు, డాక్టర్‌ ఫణిసుబ్రహ్మణ్యం, అయిల రామకృష్ణ, అత్తిలి రాంప్రసాద్, చిక్కిరెడ్డి సురేష్, అడబాల చినబాబు, వైఎల్‌ఎన్‌ స్వామి, పిట్టా కృష్ణ, వనుం గంగాధర్, నిడిగట్ల బాబ్జీ, మారిశెట్టి అర్జునరావు, కోరుకొండ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి, ఎస్సై విజయ్‌కుమార్, తహసీల్దార్‌ టీఆర్‌ రాజేశ్వరరావు, మూడు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, గ్రామ వలంటీర్లు, ఆశ కార్యకర్తలు, పలువురు వైద్యులు పాల్గొన్నారు. శిబిరానికి వచ్చిన వారికి ఓం శివశక్తి పీఠం ఆధ్వర్యంలో పులిహోర, మజ్జిగ పంపిణీ చేశారు. 

మరిన్ని వార్తలు