టీడీపీ శాశ్వ‌తంగా క్వారంటైన్‌లోనే

30 Apr, 2020 13:25 IST|Sakshi

సాక్షి, తాడేప‌ల్లి : క‌రోనా కాలంలో ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌వాల్సింది పోయి చంద్ర‌బాబు పారిపోయార‌ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్ అన్నారు. హైద‌రాబాద్‌లో కూర్చొని చంద్ర‌బాబు ఇచ్చే దిక్కుమాలిన స‌ల‌హాలు ఎవ‌రికీ అవ‌స‌రం లేద‌ని చెప్పారు. రాష్ర్టంలో ప్ర‌తిప‌క్షం ప‌నికిరాని ప‌క్షంగా మారింద‌ని వ్యాఖ్యానించారు. ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో టీడీపీ నేత‌లు ఎక్క‌డున్నారు అని ప్ర‌శ్నించారు. కోవిడ్ నిర్థార‌ణ ప‌రీక్ష‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ దేశానికే ఆద‌ర్శంగా నిలిచిందన్నారు. ఇప్పుడు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుంద‌ని పేర్కొన్నారు. వాలంటీర్ వ్య‌వ‌స్థ క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేస్తూ క‌రోనా రోగుల‌ను నిర్థారించడంలో కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని అన్నారు. క్వారంటైన్‌లో ఉన్న క‌రోనా బాధితుల‌కు మంచి పౌష్ఠికాహారం అందిస్తూ, త్వ‌ర‌గా కోలుకోవ‌డానికి స‌హ‌క‌రిస్తుంద‌ని చెప్పారు.
('బాబు.. నీ బోడి సలహాలు అవసరం లేదు' )

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో టీడీపీ అధికారంలో ఉంటే క‌రోనాను కూడా కాసుల పంటగా మార్చుకునేవార‌ని దుయ్య‌బ‌ట్టారు. హుద్‌హుద్ తుఫాను స‌మ‌యంలో చేసిన చేసింద‌దే క‌దా అని గుర్తుచేశారు.  బ‌ల‌హీన వ‌ర్గాలును ఓటుబ్యాంకు కోసం టీడీపీ నేత‌లు  వాడుకొని వ‌దిలేశార‌ని, వైఎస్సార్‌సీపీ  ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక వాళ్ల‌ను ఆదుకున్నామ‌ని పేర్కొన్నారు. జీవో.49  ద్వారా గీత కార్మికుల్లో సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోమ‌న్‌రెడ్డి లక్ష 20 వేల కుటుంబాల్లో వెలుగులు నింపారని తెలిపారు.  బడుగు బలహీన వర్గాలకు సీఎం జ‌గ‌న్  అభినవ పూలే గా నిలిచారని కొనియాడారు. గుజరాత్ రాష్ట్రంలో వేటకు వెళ్లి ఇరుక్కుపోయిన 4500 మంది మ‌త్స్య‌కారుల‌ను కేంద్రంతో మాట్లాడి, వెనక్కి తీసుకువ‌చ్చారుని వెల్ల‌డించారు. ('ఇప్పటికైనా నీచ రాజకీయాలు మానుకుంటే మంచిది' )

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు