డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నిక

17 Jun, 2019 15:35 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఎన్నిక కాబోతున్నారు. సోమవారం గడువు ముగిసే సమయానికి ఆయన ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో మంగళవారం శాసనసభలో డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటిస్తారు. సోమవారం గడువు ముగిసే సమయానికి ఆయన ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో మంగళవారం శాసనసభలో డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటిస్తారు. సోమవారం ఉదయం శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. సాయంత్రం 5 గంటల వరకూ ఈ పదవికి నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని ప్రకటించారు. 

శాసనసభ సమావేశం వాయిదా పడిన అనంతరం ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు ఆదిమూలపు సురేష్‌, ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, అన్నాబత్తుని శివకుమార్‌, కొరుముట్ల శ్రీనివాసులు,  ఆళ్ల రామకృష్ణారెడ్డి, కొట్టుగుళ్ల భాగ్యలక్ష్మి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి వెంట రాగా కోన రఘుపతి అసెంబ్లీ కార్యాదర్శి(ఇంచార్జి) పి.బాలకృష్ణమాచార్యులుకు తన నామినేషన్‌ పత్రాలను ఆయన ఛాంబర్‌లో అందజేశారు. కోన రఘుపతి నామినేషన్‌ పత్రాలపై ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఉప ముఖ్యమంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, పాలుబోయిన అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, టి.అర్థర్‌, చెట్టి ఫాల్గుణ, టీజేఆర్‌ సుధాకర్‌బాబు, మద్దిశెట్టి వేణుగోపాల్‌ సంతకాలు చేశారు.  కాగా మంగళవారం ఉదయం 11గంటలకు డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక జరగనుంది. 

చదవండి: డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

మరిన్ని వార్తలు