ప్రతిపక్ష నేతకు దానితో సంబంధం లేదా?

11 Apr, 2020 13:38 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి  సకాలంలో సమర్థవంతమైన చర్యలు తీసుకుని కరోనావైరస్‌ను అరికట్టడంలో అన్ని రాష్ట్రాల కంటే ముందున్నరని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్‌ కొట్టు సత్యనారాయణ కొనియాడారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ... తాడేపల్లిగూడెంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న రాజకీయాలపై మండిపడ్డారు. ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌తో పోరాడుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం దానితో సంబంధం లేకపోవడం మన దౌర్భాగ్యం అని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం తమకు ప్రజల కష్టాలు పట్టనట్లు హైదరాబాద్ వెళ్ళి పోయి అక్కడి నుంచి తప్పు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 1000రూపాయిలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లుగా చెబుతున్న నాయకులు దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయాలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో రాజకీయలకు దూరంగా ఉండాలనుకున్నా ప్రతిపక్షాలు చేస్తున్న చౌకబారు ప్రకటనలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కోటి ముప్ఫై లక్షల కుటుంబాలకు న్యాయం చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. కరోనాను అరికట్టడంలో రాష్ట్ర పనితీరును దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంసించడాన్ని  ప్రతిపక్షనాయకులు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు చేస్తున్న విమర్శలను రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు.  రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్ద పై మిలటరీ ఆసుపత్రి సిబ్బంది చేసిన సర్వేలో రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించిన విషయం ప్రతిపక్షాలకు మాత్రం కనిపించకపోడం శోచనీయమని సత్యనారయణ అన్నారు. 


 

మరిన్ని వార్తలు