తప్పుడు ప్రచారాలు చేస్తే ఖబడ్దార్‌!

8 Jun, 2020 15:12 IST|Sakshi

సాక్షి, ప్రకాశం: తప్పుడు రాతల పై  వైఎస్సార్‌సీపీ కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్  రెడ్డి ఫైర్ అయ్యారు. ఏడాది పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతున్న ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాస్తే సహించేది లేదని ధ్వజమెత్తారు. సోమవారం జిల్లాలో ఆయన మాట్లాడుతూ, దిగజారుడు రాతలు రాస్తే ఆ పత్రికల యాజమాన్యాల సంగతి తెలుస్తామని హెచ్చరించారు. ఎల్లో మీడియాపై ఆయన విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చంచాగిరి చేసే వాళ్లు హద్దు మీరితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసమ్మతి అంటూ తమ పార్టీ ఐక్యతను, విశ్వాసాన్ని దెబ్బతీసే కుట్రలను తిప్పికొడతాం అన్నారు. అవసరమైతే ఈ కుట్రలకు వ్యతిరేకంగా ప్రజాపోరాటం చేస్తామని మహాధర్‌ రెడ్డి ఎల్లోమీడియాపై నిప్పులు చెరిగారు. (డబ్బా కొట్టి, పత్తా లేకుండా పోయారు!)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు