ఆయన నిజ స్వరూపం బయటపడింది..

6 Jan, 2020 17:55 IST|Sakshi

వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున

సాక్షి, తిరుపతి: దళిత ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతిలోని అంబ్కేదర్‌ విగ్రహం ఎదుట వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. కుల దురహంకారం ప్రదర్శించిన చంద్రబాబుపై మేరుగ మండిపడ్డారు. విజయ్‌కుమార్‌కు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబుపై ఎస్సీ,ఎస్టీ, అట్రాసిటీ కేసు పెట్టనున్నామని తెలిపారు. మరోసారి చంద్రబాబు నిజస్వరూపం బయటపడిందని దుయ్యబట్టారు. చంద్రబాబు నోటిని అదుపులో పెట్టుకోవాలని..లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. చౌకబారు విమర్శలను సహించేది లేదని మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు.
(చదవండి: విజయకుమార్‌గాడు మాకు చెబుతాడా!)
(చదవండి: అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాలలు)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు