నీచ రాజకీయాలు మానుకోవాలి

29 Oct, 2017 12:35 IST|Sakshi

వైఎస్సార్‌ సీపీ స్టిక్కర్లు, ఫెక్సీలు చించేయడంపై ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఆగ్రహం

కురుపాం: టీడీపీ నాయకులు నీచరాజకీయాలు మానుకోవాలని  ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు పరీక్షిత్‌రాజులు అన్నారు. వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో శనివారం వారు విలేకరులతో మాట్లాడారు.  మండలంలోని టీడీపీ నాయకులు నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని, వైఎస్సార్‌ కుటుంబం కార్యక్రమంలో తమ పార్టీ నాయకులు ప్రతీ ఇంటికీ వెళ్లి  ఇంటివారి అంగీకారంతో అం టించిన వైఎస్సార్‌ ప్రతిమ ఉన్న స్టిక్కర్స్‌ చింపి వేయటం, వాటిపై చంద్రబాబు స్టిక్కర్స్‌ అంటిం చమే కాకుండా వైఎస్సార్‌ సీపీ నాయకుల బ్యాన ర్స్‌ చింపివేయటం వంటివి చేపడుతున్నారన్నారు.


ఇప్పటికే పూతికవలస, సీతంపేట, కస్పాగదబవలస, కాటందొరవలస గ్రామాల్లో వైఎస్సార్‌ కు టుంబంలో అంటించిన స్టిక్కర్స్‌పై టీడీపీ నేతల స్టిక్కర్లు అంటిస్తున్నారని, ఇటువంటి నీచరాజకీయాలు మానుకోవాలన్నారు. ఒకప్పుడు గడప గడపకు  వైఎస్సార్‌ సీపీ కార్యక్రమాన్ని చూసి స్థానిక టీడీపీ నేతలు మహిళలకు బొట్టు పెట్టే కార్యక్రమని ఎద్దేవా చేశారని, ఇప్పుడు అదే కార్యక్రమాన్ని కాపీ కొట్టి ఇంటింటికీ టీడీపీ అంటూ వెళ్తున్నారన్నారు. స్టిక్కర్లను మూసివేసినా ప్రజల గుండెల్లో చరగని ముద్ర వేసిన రాజశేఖరరెడ్డిని ఎవరూ తొలగించలేరన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ శెట్టి పద్మావతి, వైస్‌ ఎంపీపీ వంజరాపు కృష్ణ, ఎంపీటీసీ గొర్లి సుజాత,  మం డల కోఆప్షన్‌ సభ్యులు షేక్‌ నిషార్, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధికారి ప్రతినిధి శెట్టి నాగేశ్వరరావు,ఎస్సీసెల్‌ అధ్యక్షుడు రాయి పిల్లి శ్రీధర్, శ్రీను, షేక్‌ రజ్వీ, ఆదిల్, త్రిపుర పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు