ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు దీక్ష

19 Dec, 2017 11:27 IST|Sakshi

సాక్షి, ప్రొద్దుటూరు: పేదలకు పక్కా ఇళ్లు నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి దీక్ష చేపట్టారు. ప్రొద్దుటూరు మున్సిపల్‌ కార్యాలయం సమీపంలో మంగళవారం ప్రారంభమైన దీక్ష  36 గంటల పాటు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా,  చంద్రబాబు సర్కార్‌ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వివిధ సంఘాలతో కలిసి అనేక పర్యాయాలు రాచమల్లు పోరుబాట పట్టారు. తాజాగా ప్రజలకు ఉచితంగా ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఇంకోమారు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.

ప్రభుత్వం అందిస్తున్న మొదటి రకం గృహాలకు సంబంధించి రూ. 3.25 లక్షలు రుణం కాగా, సబ్సిడీ కింద కేంద్రం రూ. 1.50 లక్షలు.. రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.50 లక్షలు కలుపుకుని మొత్తం రూ. 6.25 లక్షలు మంజూరు చేస్తున్నారు. అయి తే ఆ సొమ్మును 30 ఏళ్లలోపు చెల్లించేలా ఒప్పందం రాసుకుంటున్నారు. అయితే 30 ఏళ్లకు దాదాపు లెక్కలు వేస్తే రూ. 18 లక్షలు అవుతోంది. అంటే ప్రతినెల కంతు కింద రూ. 3500-4000 వరకు కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి కాకుండా దివంగత సీఎం వైఎస్సార్‌ తరహాలోనే ప్రజలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి అందించాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మెల్యే దీక్షకు దిగారు. 

మరిన్ని వార్తలు