విశాఖ విషాదం కలిచివేసింది: ఎమ్మెల్యే రోజా

8 May, 2020 16:28 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: విశాఖ గ్యాస్‌ లీకేజ్‌ విషాదం అందరినీ కలచివేసిందని ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన పరిహారాన్ని చూసి అన్ని పార్టీలు అభినందిస్తున్నాయని పేర్కొన్నారు. సీఎం తక్షణమే విశాఖకు చేరుకుని బాధితులను పరామర్శించి ధైర్యం నింపారని తెలిపారు. అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులున్నారని.. ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం మనసున్న ముఖ్యమంత్రి ఉన్నారని పేర్కొన్నారు. అందుకే ప్రజల కష్టాలను చూసి చలించిపోయారని.. ఎన్నడూలేని విధంగా రూ.కోటి నష్టపరిహారాన్ని ప్రకటించారని చెప్పారు.
(‘ఆ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది’)

వారు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు..
టీడీపీ నేతలు దీనిపై కూడా చీప్‌గా మాట్లాడుతున్నారని రోజా మండిపడ్డారు. సీఎం జగన్‌ ఈ ఘటనపై హైపవర్‌ కమిటీతో విచారణకు ఆదేశించారని తెలిపారు. యాజమాన్యం నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. యాజమాన్యంపై కూడా పోలీసు కేసు నమోదయ్యిందన్నారు. టీడీపీ నేతలు సిగ్గులేకుండా విమర్శలు చేస్తున్నారని ఆమె నిప్పులు చెరిగారు. (గ్యాస్‌ దుర్ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష)

>
మరిన్ని వార్తలు