ఎమ్మెల్యే రోజాపై దాడి, చేతికి తీవ్ర గాయం

13 Sep, 2014 08:38 IST|Sakshi
ఎమ్మెల్యే రోజాపై దాడి, చేతికి తీవ్ర గాయం

నగరి : చిత్తూరు జిల్లా నగరిలో టిడిపి నేతలు, కార్యకర్తలు దౌర్జన్యానికి తెగబడ్డారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను లక్ష్యంగా చేసుకుని నానా రభస సృష్టించారు.  నగరిలో ఏటా అమ్మవారి జాతర ఘనంగా జరుగుతుంది. చివరి రోజు ప్రోటో కాల్ ప్రకారం దేవతలకు ఎమ్మెల్యే ప్రధాన హారతి ఇవ్వడం ఆనవాయితీ.

అయితే ఇందుకు విరుద్ధంగా టిడిపి నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు.  జాతర పెద్ద కుమరేశన్ మొదలియార్ ప్రధాన హారతి ఇవ్వకూడదని ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. ఈ తోపులాటలో రోజా చేతిలోని హారతిపళ్లెంను మరోవర్గం వారు లాగేయటంతో ఆమె చేతికి తీవ్ర గాయమైంది. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ ఘటనపై వైఎస్ఆర్ సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అధికారంలో ఉన్న నేతలకు పోలీసులు కూడా సహకరించటం బాధాకరమని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. పథకం ప్రకారమే వైఎస్ఆర్ సీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

(ఇంగ్లీష్ కథనం)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా