జేసీ, అచ్చెన్నాయుడు నోరు విప్పితే..

15 Jun, 2020 16:18 IST|Sakshi

సాక్షి, తిరుపతి: అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్‌రెడ్డి అవినీతి చేసి అడ్డంగా దొరికి పోయారని.. వీళ్లు నోరు విప్పితే చంద్రబాబు, లోకేశ్‌ల బండారం వెలుగు చూస్తుందని ఏపీఐఐసీ చైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. సోమవారం ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. జేసీ, అచ్చెన్నాయుడు నోరు విప్పితే వారి బండారం అంతా బయట పడుతుందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, అతని కుమారుడు లోకేశ్‌ భయపడుతున్నారన్నారు. అందుకే వారు కుడితిలో పడ్డ ఎలుకల్లా గిల గిల కొట్టు కుంటున్నారని.. విజయవాడ, అనంతపురానికి పరుగులు తీసున్నారని ఎద్దేవా చేశారు. ( అఖిలప్రియ సోదరుడి దౌర్జన్యం )

అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్‌ రెడ్డిని బుజ్జగించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాము నిప్పు అని చెప్పుకునే టీడీపీ నేతలు ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు అనడం సిగ్గు చేటని మండిపడ్డారు. కరోనా వైరస్‌తో జనం అల్లాడుతుంటే చంద్రబాబు ఒక్కరోజు కూడా ప్రజలకు భరోసా ఇ‍వ్వలేదన్నారు. హైదరాబాద్‌ నుంచి రావడానికి తనకు అనుమతి ఇవ్వలేదని చెప్పుకున్న ఆయన మరి ఇప్పుడు ఎలా వచ్చారని ప్రశ్నించారు. ప్రజలకు భరోసా నిస్తుంటే నిబంధనలు‌ పాటించలేదని వైఎస్సార్‌సీపీ నాయకులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు ఎలా వచ్చారని నిలదీశారు. ఇది చంద్రబాబు నీతిమాలిన రాజకీయానికి నిదర్శనమని రోజా విమర్శించారు. (ఎల్జీ గ్యాస్ లీక్ ఘటనపై సుప్రీంకోర్టు విచారణ)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా