బాబుది పూటకో మాట..తడవకో అబద్ధం

16 Feb, 2019 13:05 IST|Sakshi

వెలిగొండ పూర్తి చేసి, సంక్రాంతికి నీళ్లిస్తామని మోసం చేశారు

రైతుల, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ మాట మరిచారు

నిన్నెలా నమ్ముతాం చంద్రబాబు 

జగనన్నతోనే బీసీ వర్గాలకు సమన్యాయం

సంతనూతలపాడు ఎమ్మెల్యే, యర్రగొండపాలెం నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త డాక్టర్‌ సురేష్‌ 

పెద్దదోర్నాల: పూటకో మాటతో, తడవకో అబద్ధంతో మభ్య పెడుతున్న మిమ్మల్ని ప్రజలెలా నమ్ముతారు బాబు అని సంతనూతలపాడు ఎమ్మెల్యే, యర్రగొండపాలెం నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌  ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం రాత్రి మండల పరిధిలోని కటకానిపల్లెలో జరిగిన నిన్ను నమ్మం బాబు–2 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై గ్రామమంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శనాస్త్రాలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డ చంద్రబాబు నాయుడును ప్రజలెలా నమ్ముతారు అని ప్రశ్నించారు.  

ఇప్పుడు గుర్తుకు వచ్చారా బీసీలు..?
బీసీ వర్గాల సంక్షేమాన్ని పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీసీలు ఇప్పుడు గుర్తుకు వస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని బీసీలకు సమ న్యాయం జరగాలంటే జగనన్న నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. 

ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు
అధికారంలోకి రాగానే పూర్తిగా రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, అందరికీ ఇళ్లు నినాదాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాలుగున్నరేళ్లయినా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకుండా ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. 2014 మోడీతో పొత్తు పెట్టుకుని సోనియాగాంధీని విమర్శించిన చంద్రబాబు నేడు మోడీని తిడుతూ రాహల్, సోనియా గాంధీ కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. 

కమీషన్ల కోసం కక్కుర్తి
కమీషన్‌ల కోసం కక్కుర్తి పడి ప్రాజెక్టు అంచనాలను అమాంతం పెంచిన ముఖ్యమంత్రి వెలుగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణ పనులు తన అనుయాయులకు అప్పగించారన్నారు. ప్రాజెక్టు పనులను పూర్తి చేసి గడిచిన సంక్రాతికే నీరిస్తామన్న హామీని నిలబెట్టుకోలేని మిమ్మల్ని ప్రజలెలా విశ్వసిస్తారు బాబూ అంటూ ప్రశ్నించారు. 

జగన్‌తోనే వెలిగొండ పూర్తి 
జగన్‌మోహన్‌రెడ్డి రానున్న ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి వస్తున్నారని, వైఎస్‌ జగన్‌ మోహనరెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని, వెలిగొండ ప్రాజెక్టు జగన్‌తోనే పూర్తవుతుందన్నారు. ప్రజలు ఇప్పటికైనా ప్రభుత్వం చేస్తున్న మోసాలు గుర్తించాలని కోరారు. కటకానిపల్లెలో కార్యకర్తలు భారీ భైక్‌ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే సురేష్‌ భారీ ర్యాలీతో గ్రామంలో పర్యటించి చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించారు.  ఈ కార్యక్రమంలో మండల పార్టీ అ«ధ్యక్షుడు జంకె ఆవులరెడ్డి, నూర్‌ బాషాల సంఘం తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు రసూల్, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర మైనారిటీ సెల్‌ ప్రధాన కార్యదర్శి షేక్‌ అబ్దుల్‌ మజీద్, ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు లాలూనాయక్, నాయకులు దండా సుబ్బారెడ్డి, బొల్లేపల్లి సీతయ్య, నల్లబోతుల వెంకటేశ్వర్లు ,చిట్యాల లక్ష్మీరెడ్డి, యక్కంటి మల్లారెడ్డి,  వెన్నా కాశిరెడ్డి, కర్రా మల్లారెడ్డి, వల్లభనేని పవన్‌కుమార్, అల్లు రాంభూపాల్‌రెడ్డి, గొల్మారి ఆంజనేయరెడ్డి, అలుగుల లక్ష్మయ్య, మాండ్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

ఈనాటి ముఖ్యాంశాలు

చంద్రబాబు తీరు ఇంకా మారలేదు

గ్రహణం రోజున ఆ ఆలయం తెరిచే ఉంటుంది

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ఏపీలో 38 మంది డీఎస్పీలు బదిలీ

ఏపీకి కొత్త గవర్నర్‌

చిరునవ్వుతో స్వాగతించాలి : సీఎం జగన్‌

‘విభజన హామీలు నెరవేర్చుతాం’

పరిశీలనలో వెనుకబడిన జిల్లాల నిధులు

‘కాపులను అన్ని విధాల ఆదుకుంటాం’

కాంచీపురంలో టీటీడీ చైర్మన్‌ దంపతులు

వారికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం: వైఎస్‌ జగన్‌

‘కాపులను దశలవారీగా మోసం చేశారు’

80 శాతం గ్రీవెన్సెస్‌ వాటికి సంబంధించినవే : సీఎం జగన్‌

దానికి కట్టుబడివున్నాం: పురందేశ్వరి

టీడీపీ నేతలకు అంబటి చురకలు..!

చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా ఫైర్‌

ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్‌ 

పున:పరిశీలనంటే బాబు ఎందుకు వణికిపోతున్నారు?

బైకులు ఢీ; బస్సు కిందపడి ఇద్దరమ్మాయిల దుర్మరణం

అరకులోయలో మహిళా డిగ్రీ కళాశాల

నిధులు చాలక..నత్తనడక

ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 దర్శనాలు రద్దు

7 నుంచి చెన్నై సంత్రాగచ్చి వీక్లీ స్పెషల్‌

సదావర్తి భూముల్లో అక్రమాలపై విచారణ జరిపిస్తాం

దివిసీమలో గాలివాన బీభత్సం

ధర్నాలతో దద్దరిల్లిన కాకినాడ కలెక్టరేట్‌

ఈ బండి.. తోస్తే గానీ కదలదండీ !

పెన్సిల్‌ ముల్లుపై షిర్డీసాయిబాబా 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’