చేనేతలను చంద్రబాబు పట్టించుకోలేదు..

20 Jun, 2020 15:42 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు

సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయిన ఆరునెలలు ముందుగానే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ‘నేతన్న నేస్తం’ అందించిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మగ్గం ఉన్న ప్రతి నేతన్నకు రూ.24 వేలు ఇచ్చినందుకు ఆయన సీఎం వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టేశారని మండిపడ్డారు.

టీడీపీ ప్రభుత్వం చేనేతలను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ధర్మవరంలో ఇచ్చిన మాటను సీఎం వైఎస్‌ జగన్‌ నిలబెట్టుకున్నారని, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తన పాలనతో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని తెలిపారు. సీఎం నేతృత్వంలో కొత్త పథకాలు పరంపర కొనసాగుతుందని సుధాకర్‌ బాబు పేర్కొన్నారు. (శాసనసభ నిర్ణయమే అంతిమం: స్పీకర్‌)

‘‘రాజ్యసభ ఎన్నికలతో టీడీపీ పతనం అయ్యింది. రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ బలం 6 కి పెరిగింది. టీడీపీకి ఒక్కటే మిగిలింది. దళితుడైన వర్ల రామయ్యను చంద్రబాబు బలి పశువు చేశారు. ఓడిపోయే సీటు వర్లకు ఇచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు దళితులకు రాజ్యసభ సీట్లు ఇవ్వలేదు. ఆయన సామాజిక వర్గం వారికే చంద్రబాబు రాజ్యసభ స్థానాలు కట్టబెట్టారు. ఆదిరెడ్డి భవాని ఓటు తప్పుగా వేసిందో, ఉద్దేశపూర్వకంగా వేసిందో తరువాత తెలుస్తుంది. దళితులైన మోత్కుపల్లి, పుష్పరాజ్, వర్లకు రాజ్యసభ సీటు ఇస్తామని చంద్రబాబు మోసం చేశారని’  సుధాకర్‌బాబు దుయ్యబట్టారు.

గెలిసే సీటు ఆయన సామాజిక వర్గం వారికి, ఓడిపోయే సీటు దళితులకు ఇచ్చారని చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. లోకేష్‌ ను ఎందుకు రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి నిలపలేదని ప్రశ్నించారు. చంద్రబాబు హైదరాబాద్ లో ఉండి రాజకీయం చేస్తున్నారని సుధాకర్‌బాబు నిప్పులు చెరిగారు. ('కొడుకు విప్లవ యోధుడిలా కనిపించి ఉంటాడు')

మరిన్ని వార్తలు