క్షతగాత్రుడికి చికిత్స అందించిన ఎమ్మెల్యే శ్రీదేవి

22 Dec, 2019 04:15 IST|Sakshi

తాడేపల్లి రూరల్‌: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆటో డ్రైవర్‌కు చికిత్స అందించి వైద్యురాలిగా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించారు తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి. గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద హైవే సర్వీస్‌ రోడ్డులో కారు, ఆటో ఢీకొన్నాయి. శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌ స్వామి అయ్యప్ప తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో తాడికొండ వెళ్తున్న ఎమ్మెల్యే శ్రీదేవి ఈ ప్రమాదాన్ని గమనించి.. గాయపడిన ఆటో డ్రైవర్‌ను 108 వాహనంలో ఎక్కించి.. సుమారు 20 నిమిషాలపాటు ప్రాథమిక చికిత్స అందించారు. అతడిని 108 వాహనంలో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. ఎమ్మెల్యే తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేసి ప్రమాద విషయాన్ని తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విస్తరిస్తున్న కరోనా!

కరోనా రాకుండా.. స్టీమ్‌ బూత్‌

ఏపీలో కొత్తగా ఒకటే కరోనా పాజిటివ్‌ కేసు

‘ప్రజలెవ్వరూ అధైర్య పడొద్దు’

కరోనా వైరస్‌: త్రిముఖ వ్యూహం..

సినిమా

కరోనాపై పోరాటం: సూపర్‌ స్టార్ల షార్ట్‌ఫిల్మ్‌

దేశం కోసం ఓ మంచి పని చేద్దాం : కాజల్‌

కరోనా విరాళం

కూతురి కోసం...

తమ్మారెడ్డి భరద్వాజకు మాతృ వియోగం

శ్రీలక్ష్మి కనకాల ఇకలేరు