ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభపెట్టే అవకాశాలు

7 Jun, 2015 12:56 IST|Sakshi

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీతినిజాయితీ గురించి సమావేశాల్లో పదేపదే మాట్లాడుతుండటంపై కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్రెడ్డి, మణిగాంధీ, ఎస్వీ మోహన్రెడ్డి మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ వ్యవహారశైలి శోచనీయంగా ఉందన్నారు. ఆదివారం కర్నూలులో పార్టీ ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్రెడ్డి, మణిగాంధీ, ఎస్వీ మోహన్రెడ్డి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి సంఖ్యాబలం ఉన్న చోట పోటీ పెట్టకుండా ఉండాని వారు సూచించారు. అలాగే వైఎస్ఆర్ సీపీ సంఖ్యా బలం తక్కువగా ఉన్న చోట పోటీకి నిలబడటం లేదని ఆయన స్పష్టం చేశారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒంగోలు, కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ సీపీకి సంఖ్యా బలం ఉందని వారు స్పష్టం చేశారు. అయితే కర్నూలు జిల్లాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభపెట్టే అవకాశాలున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఈ అంశంలో ఉన్నతాధికారులు, పోలీసులపై నమ్మకం లేదన్నారు. ఈ విషయంపై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు