‘రెండు బిల్లులను స్వాగతిస్తున్నాం’

22 Jan, 2020 15:36 IST|Sakshi
వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌(ఫైల్‌ ఫొటో)

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. శాసన మండలిలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లుల(అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లు)ను స్వాగతిస్తున్నామని తెలిపారు. పాలన వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ధి ఫలాలు పేదవారికి అందుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సహజ వనరులు ఉన్నాయని.. వాటిని అందిపుచ్చుకోవాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అభిప్రాయపడ్డారు.

ముఖ్య విషయాలను దాచిపెట్టారు..
ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రానికి ఐకానిక్ బిల్డింగులు అవసరమని గత ప్రభుత్వం ఆలోచించ లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ విమర్శించారు. రాజధాని అంశంలో శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా చంద్రబాబు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ‘అమరావతి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే ఆహారలోటు ఏర్పడుతుందని శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. కానీ.. టీడీపీ శివరామకృష్ణన్ కమిటీలో ఉన్న ముఖ్యమైన విషయాలను దాచిపెట్టింది’ అని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనని.. అందుకోసం రెండు బిల్లులను స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు