ఆ పార్టీ గుర్తుని మార్చండి: వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

22 Mar, 2019 19:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తోన్న అక్రమాల గురించి సాక్ష్యాధారాల‌తో కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశామ‌ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజ‌యసాయిరెడ్డి తెలిపారు. సీఈసీ సునీల్‌ అరోరాకి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నిక‌ల‌లో అక్రమాలకు పాల్పడేందుకు చంద్రబాబు నాయుడు త‌గిన ఏర్పాట్లు చేసుకున్నార‌ని ఆరోపించారు. ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని చంద్రబాబు కుట్ర ప‌న్నుతున్నారని విమర్శించారు. నూత‌న డీజీపీ నియామ‌కం, ప్రస్తుత డీజీపీ తొల‌గింపు అంశాల‌తోపాటు ఇంటిలిజెన్స్ విభాగం అధికారి వెంక‌టేశ్వర‌రావు, పోలీసు అధికారులు యోగానంద్, విక్రాంత్ పాటిల్ చ‌ట్ట వ్యతిరేక కార్యక్రమాల‌కు పాల్పడుతున్నట్లు ఈసీ దృష్టికి తీసుకెళ్లామ‌ని విజయసాయిరెడ్డి తెలిపారు.

పోలీసు విభాగంలో 37 మంది అధికారుల‌కు ప‌దోన్నతి క‌ల్పించార‌ని, సూప‌ర్ న్యూమ‌రీ ద్వారా కొంత మంది అధికారుల‌ను ఎలివేట్ చేశార‌ని ఆయన వెల్లడించారు. చ‌ట్ట వ్యతిరేకంగా శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీలుగా నాన్‌ క్యాడ‌ర్ ఆఫీసర్‌లను నియ‌మించార‌ని పేర్కొన్నారు. పోలీసుల సాయంతో డ‌బ్బును ఓటర్లకు పంచేందుకు వీలుగా త‌గిన బందోబ‌స్తును ఏర్పాటు చేసి త‌ర‌లిస్తున్నార‌ని ఆరోపించారు. శ్రీకాకుళంలో నారాయ‌ణ కాలేజీ నుంచి కారులో డ‌బ్బు త‌ర‌లిస్తుండ‌గా ఎమ్మార్వో ప‌ట్టుకున్నార‌ని, తీరా ఎన్నిక‌ల సామాగ్రి ఉంద‌ని అధికారులు బుకాయించార‌ని మండిపడ్డారు. వైఎస్‌ వివేకానంద‌రెడ్డి హత్య కేసులో పోలీసులు అనుస‌రిస్తోన్న విధానాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు.

వైఎస్సార్‌సీపీ నేత‌లు ఫోన్ల‌ను అక్రమంగా టాపింగ్ చేస్తున్నార‌ని, దీనికి సంబంధించిన ఆధారాలను ఈసీకి అప్పగించామ‌ని ఆయన తెలిపారు. ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాప్టర్ రెక్కలు వైఎస్సార్‌సీపీ ఫ్యానుతో పోలి ఉందని, ఆ గుర్తును మార్చాల‌ని ఈసీకి విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. ప్రజాశాంతి పార్టీ కండువా కూడా తమ పార్టీలా మూడు రంగులు క‌లిగి ఉంద‌ని గుర్తు చేశారు. చంద్రబాబుతో అనైతిక స‌యోధ్య వ‌ల్లే కేఏ పాల్ మోసానికి పాల్పడుతున్నార‌ని ధ్వజ‌మెత్తారు. చంద్రబాబు అక్రమాల గురించి  సోమ‌వారం సాయంత్రం నాలుగు గంట‌ల‌కు ఈసీ ఉన్నతాధికారుల‌కు మరోసారి వివ‌రిస్తామ‌ని వెల్లడించారు.


 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కుటుంబ కథా చిత్రం!

ఒక్కో ఓటుపై రూ.700

అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?

రెండు చోట్ల అందుకే ఓడిపోయా: పవన్‌

గడ్కరీ ఓడిపోతాడు.. ఆడియో క్లిప్‌ వైరల్‌!

సీఎంతో విభేదాలు.. కేబినెట్‌ భేటీకి డుమ్మా!

నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కొంటున్నారు

మాయ, అఖిలేష్‌ల ఫెయిల్యూర్‌ స్టోరీ

అంతా మీ వల్లే

బాబు వైఎస్సార్‌సీపీలోకి వెళితే నేను..

కేశినేని నాని కినుక వెనుక..

కొన్నిసార్లు అంతే.. !!

ఎంపీ కేశినేని నానితో గల్లా భేటీ

‘మాతో పెట్టుకుంటే పతనం తప్పదు’

టీడీపీకి ఎంపీ కేశినేని నాని షాక్‌!

చీఫ్‌ విప్‌గా మార్గాని భరత్‌ రామ్‌

‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయింది...

గిరిరాజ్‌కు అమిత్‌ షా వార్నింగ్‌

అఖిలేశ్‌ భార్యను కూడా గెలిపించుకోలేకపోయాడు!

యూపీలో కూటమికి బీటలు..?

జగన్‌ పాలనను.. చూస్తున్నారా చంద్రబాబూ?

సంఖ్యే ముఖ్యం... శాతం కాదు

గాంధీజీపై ఐఏఎస్‌ అధికారిణి వివాదాస్పద వ్యాఖ్య

బదులు తీర్చుకున్న నితీశ్‌

నితీశ్‌ కేబినెట్‌లోకి కొత్త మంత్రులు.. బీజేపీకి కౌంటర్‌!

మళ్లీ అదే జోడీ

‘త్రిభాష’పై తమిళ పార్టీల కన్నెర్ర

రక్షణ బాధ్యతల్లో రాజ్‌నాథ్‌