జననేతకు జేజేలు

15 Mar, 2014 01:35 IST|Sakshi
జననేతకు జేజేలు
  • జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన దేవభక్తుని సుబ్బారావు
  •   వెయ్యిమంది కాంగ్రెస్ నేతలు,   కార్యకర్తలు చేరిక
  • గన్నవరం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారం కోసం పశ్చిమగోదావరి జిల్లా వెళ్లేందుకు శుక్రవారం మధ్యాహ్నం 1.10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన అధినేతకు జేజేలతో స్వాగతం చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పెనమలూరు నియోజకవర్గానికి చెందిన డీసీసీ ప్రధాన కార్యదర్శి దేవభక్తుని సుబ్బారావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

    ఆయన ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పలువురు సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ఎంపీటీసీ మాజీ సభ్యులు కూడా పార్టీలో చేరారు. స్థానిక విమానాశ్రయం ప్రధాన ద్వారం ఎదురుగా ఐటీ పార్కు రోడ్డులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై దేవభక్తునికి జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. పెనమలూరు నియోజకవర్గానికి చెందిన సుబ్బారావుతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలోకి రావడం ఆనందంగా ఉందని వైఎస్ జగన్ అన్నారు.

    మండుటెండను సైతం లెక్కచేయకుండా తన కోసం ఇక్కడికి వచ్చి ఇంతటి ఆప్యాయత, ఆత్మీయత చూపించడం మరువలేనిదన్నారు. పార్టీలోకి వచ్చిన ప్రతి అవ్వకు, అక్కకు, చెల్లెమ్మకు, అన్నదమ్ములకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నరసాపురం బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు, గన్నవరం     నియోజకవర్గాల సమన్వయకర్తలు పడమట సురేష్‌బాబు, డాక్టర్ దుట్టా రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
     
    పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు...
     
    జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పెనమలూరు నియోజకవర్గానికి చెందిన దేవభక్తుని గంగాధరరావు, తాతినేని పూర్ణచంద్రరావు, కంచర్ల వెంకటేశ్వరరావు, వంగూరి వెంకటేశ్వరరావు, కొపరౌతు సత్యనారాయణ, కొక్కిలిగడ్డ జాన్‌బాబు, భారతిలక్ష్మి, నంబూరి అంజమ్మ, కొట్టె రాజమోహన్, చెరుకునీడి శివాజీ, మేడిశెట్టి శివశంకరరావు, అనురాధ, ఎస్‌కే ఖాదీర్, నూర్జహాన్, బాషా తదితరులు పార్టీలో చేరినవారిలో ఉన్నారు.
     
    వైఎస్సార్ సీపీలో బెల్లాన చంద్రశేఖర్ చేరిక
     
    అంపాపురం (హనుమాన్‌జంక్షన్ రూరల్) : విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన శుక్రవారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని బాపులపాడు మండలం అంపాపురంలో కలుసుకున్నారు. ఆయనకు జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు అఖండ మెజారిటీతో విజయం సాధించేలా క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా పనిచేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. మాజీ మంత్రి, విజయనగరం జిల్లా పార్టీ కన్వీనర్ పి.సాంబమూర్తి రాజు, విజయనగరం పార్లమెంటు కన్వీనర్ బొబ్బిలి మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బేబి నాయన, గరివిడి మండల కన్వీనర్ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, సొసైటీ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులను జగన్‌మోహన్‌రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.
     
    జగన్‌ను కలిసిన నేతలు...
     
    తొలుత పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలు, విజయవాడ నగర అధ్యక్షులు సామినేని ఉదయభాను, తెల్లం బాలరాజు, జలీల్‌ఖాన్, విజయవాడ, ఏలూరు ఎంపీ అభ్యర్థులు కోనేరు రాజేంద్రప్రసాద్, తోట చంద్రశేఖర్, బందరు పార్లమెంటు సమన్వయకర్త కుక్కల విద్యాసాగర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి వెంకటేశ్వరరావు (నాని), వంగవీటి రాధాకృష్ణ, ముసునూరి రత్నబోస్, ముదునూరి ప్రసాదరాజు, మేకా వెంకటప్రతాప్ అప్పారావు, నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, పడమట సురేష్‌బాబు, ఉప్పులేటి కల్పన, సింహాద్రి రమేష్‌బాబు, దూలం నాగేశ్వరరావు, రక్షణనిధి, జిల్లా మహిళ కన్వీనర్ తాతినేని పద్మావతి, పార్టీ నాయకులు లాకా వెంగళరావు యాదవ్, ఎంఎస్ బేగ్, మేచినేని బాబు, సూరం విజయకుమార్, కోటగిరి గోపాల్, దుట్టా రవిశంకర్, సర్పంచ్‌లు నీలం ప్రవీణ్‌కుమార్, సాతులూరి శివనాగరాజకుమారి తదితరులు స్వాగతం పలికారు.
     
    చోరీ నిందితుడి అరెస్ట్

    కైకలూరు, న్యూస్‌లైన్ : కైకలూరులోని విజయలక్ష్మీ థియేటర్ ఎదుట వెంకటేశ్వర రైస్‌మిల్‌లో చోరీ ఘటనలో నిందితుడిని టౌన్ ఎస్‌ఐ దాడి చంద్రశేఖర్ శుక్రవారం స్థానిక టీటీడీ కల్యాణ మండపం వద్ద అరెస్టు చేశారు. ఈ నెల తొమ్మిదో తేదీ రాత్రి రైస్‌మిల్లులో రూ.16,500 చోరీకి గురయ్యింది. యజమాని నాంచారయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ గాంధీనగర్‌కు చెందిన కాపు భీమయ్య (30) చోరీకి పాల్పడినట్లు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
     

మరిన్ని వార్తలు