‘ఆధార్‌ సవరణ బిల్లుకు మద్దతిస్తాం’

8 Jul, 2019 18:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్‌ డేటాను ప్రైవేట్‌ సంస్థలతో పంచుకోవడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి అన్నారు. సోమవారం రాజ్యసభలో ఆధార్‌ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ ఆధార్‌ వివరాలను ప్రైవేట్‌ సంస్థలకు షేర్‌ చేయడం సరైనదేనా అని ప్రశ్నించారు. సెక్షన్‌ 47 ప్రకారం ఇది రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయస్ధానం పేర్కొన్నదని చెప్పారు.

సమాచార పరిరక్షణ బిల్లును ప్రభుత్వం ఎందుకు తీసుకురావడం లేదని అన్నారు. తాము ఆధార్‌ సవరణ బిల్లుకు మద్దతిస్తామని తెలిపారు. ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన ఆఫ్‌లైన్‌ డేటా దుర్వినియోగం‍ కాకుండా ఈ బిల్లు నిరోధించగలదా అని ఆయన ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు